టాలీవుడ్

ఎన్టీఆర్ లేటెస్ట్ వీడియో పై హాట్ హాట్ చర్చ, ఏముంది అందులో

జై లవ కుశ సినిమాతో ఘనవిజయం సాధించిన ఎన్టీఆర్, ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత‍్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ లో కనిపించబోతున్నాడు. అందుకు తగ్గట్టుగా స్లిమ్‌ లుక్‌ లోకి మారిపోయేందుకు హాలీవుడ్‌ ఫిజికల్ ట్రైనర్‌ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ టెంపర్‌ సినిమాలో కన్నా ఫిట్‌ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

జిమ్‌లో తారక్‌ వ్యాయామం చేస్తుండగా తీసిన వీడియోను ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.‌ ‘మేము ఇంకా పూర్తి చేయలేదు’ అని ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ హీరోలు హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్ కూడా స్టీవెన్స్‌ దగ్గరే శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

అలాగే ఎన్టీఆర్ మరో సందర్భంలో దిగిన ఫొటోలు తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో తారక్‌ చాలా ఫ్రెష్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు తారక్‌ లుక్‌ బాగుందని, నచ్చిందని తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

తారక్‌ 28వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించనున్నారు. ఎస్‌.ఎస్‌. తమన్‌ బాణీలు అందించనున్నారు. శ్రద్ధాకపూర్‌ ఇందులో తారక్‌ సరసన నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ‘జైలవకుశ’ తర్వాత తారక్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది.

ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రం హిట్ తో మాంచి జోరుమీదున్నాడు ఎన్టీఆర్. ఏకంగా మూడు పాత్రలు పోషించి ఔరా..! అనిపించిన ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే జరిగాయి. ఆ సమయంలో త్రివిక్రమ్‌ అజ్ఞాతవాసి బిజీలో ఉన్నారు.ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాపైనే దృష్టిపెట్టారు త్రివిక్రమ్‌.

అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత ఈ సినిమాపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సినిమా ఉంటుందా లేదా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే కేవలం ఒక ఫ్లాప్‌తో దర్శకుడి ప్రతిభను తక్కువ చేయలేమని, . సినీరంగంలో జయాపజయాలు అతి సహజం అని ఎన్టీఆర్‌ ముందుకు వచ్చారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ మార్చి మూడవ వారంలో మొదలవుతుందని తెలిసింది. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపిస్తారని అంటు న్నారు. గత నాలుగైదు నెలలుగా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి కూడా వినిపిస్తున్నాయి. సినిమాకు నేపథ్యం ఆర్మీ అని చెప్తున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2