బాక్స్ ఆఫీస్

ఈ రోజే ఎన్టీఆర్ యూరప్ ప్రయాణం…అందుకోసమే అంటూ ప్రచారం

ntrజూనియర్ ఎన్టీఆర్ ఇక ఈ రోజు నుంచి యూరప్ టూర్ పెట్టుకున్నారు. వచ్చే నెల దాకా …ఆయన ఫ్యామిలీ తో కలిసి ఆస్ట్రియా, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో గడుపుతారు. ఈ నేపధ్యంలో ఆయన టూర్ కు వెళ్లటానికి రకరకాల కారణాలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అందులో ఒకటి …యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొంత కాలంగా అటు బిగ్ బాస్ అంటూ ఇటు “జై లవ కుశ” అంటూ బిజీ బిజీ గా గడిపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ కి తన ఫ్యామిలీ తో స్పెండ్ చేయడానికి టైం దొరకలేదట.

అయితే గత నెల దసరాకి “జై లవ కుశ” ని రిలీజ్ చేసి హిట్ ని అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీని మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ దర్శకత్వం లో చేయబోతున్నాడు. కాని ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా మూడు నెలల సమయం ఉందట. సో ఈ దొరికిన టైం గ్యాప్ లోనే జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్ వెళ్దాం అని డిసైడ్ అయ్యారు.

ఇంకో టాక్ ఏమిటంటే…

ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేయనుండగా , ఇందులో ఎన్టీఆర్ చాలా స్లిమ్‌గా కనిపించాలట. అందుకని తన శరీరాన్ని మౌల్డ్ చేస్తుకునేందుకు యూరప్ వెళ్లి అక్కడ ఓ నెల రోజుల పాటు ‘డీ టాక్సినేషన్ థెరపీ’ చేయించుకుంటాడట. ఈ థెరపీ ముఖ్య ఉద్దేశం శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడం ఇక ఇది పూర్తైన తరువాత అక్కడి నుంచి మలేసియా వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటాడని అంటున్నారు. ప్రస్తుతం డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిపుణుల పర్యవేక్షణలో జిమ్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడట ఎన్టీఆర్ .

థాయ్ ల్యాండ్ .. ఇండోనేషియా స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ను తెరపై చూపించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ప్రస్తుతం పవన్ సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ , ఈ మూవీ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాడట. జనవరి 23 .. 24వ తేదీల్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll