హాలీవుడ్

నగ్నంగా నిలబెట్టిన నిర్మాత,బెడ్ రూంకు రమ్మంటూ..

Jennifer Lawrence arrives at ELLE's 24th Annual Women in Hollywood Celebration at Four Seasons Hotel Los Angeles at Beverly Hills on October 16, 2017 in Los Angeles, California.  (Photo by Jon Kopaloff/FilmMagic)

తన నటజీవితానికి సంబంధించి సంచలన విషయాల్ని వెల్లడించింది హాలీవుడ్ ప్రముఖ నటి జెన్నీఫర్ లారెన్స్. సుమారు 20 ఏళ్ల పాటు ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్ స్టన్ చేసిన దారుణాలపై ఇటీవల నటీమణులు పెద్ద ఎత్తున వాస్తవాలు వెల్లడిస్తున్న వేళ.. జెన్నీఫర్ కొత్త విషయాల్ని చెప్పుకొచ్చారు. తన పదహారేళ్ల వయసులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక నిర్మాత తనతో మాట్లాడుతూ… “నువ్వు కొంచెం లావుగా ఉన్నా.. బెడ్రూంలో టైం స్పెండ్ చేయటానికి ఆకర్షణీయంగా ఉన్నావ్” అని అన్నాడని.. కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని తాను ఆ విషయాల్ని ఇంతకాలం వెల్లడించలేదన్నారు.

అలాగే సినిమా చాన్స్ కోసం తనను బరువు తగ్గాలని చెప్పిన మహిళా నిర్మాత.. తనలా అవకాశాల కోసం వచ్చిన నలుగురు అమ్మాయిల్ని నగ్నంగా నిలబెట్టిందని.. వారితో పాటు తానూ ఉన్నానని చెప్పింది. అందులో ఒక అమ్మాయి లావుగా ఉందని రిజెక్ట్ చేశారన్నారు. నువ్వే నీ న్యూడ్ ఫోటోలు తీసుకుంటే త్వరగా బరువు తగ్గాలన్న స్ఫూర్తి నీకు వస్తుందంటూ తనను కామెంట్ చేసిందని చెప్పింది. కలల ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవం ఇవ్వాలన్న గళాన్ని తాను విప్పనున్నట్లుగా వెల్లడించింది జెన్నిఫర్. తరచి చూస్తే.. ఇలాంటివి మరెన్ని ఉంటాయో?

కెరీర్ విషయానికి వస్తే..

సుప్రసిద్ధ హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్…అత్యంత విజయవంజమైన సినీ హీరోయిన్‌గా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. విశేష ప్రాచుర్యం పొందిన హంగర్ గేమ్స్ సిరీస్ చిత్రాల్లో కట్నిస్ ఎవర్డీన్ పాత్ర పోషించడం ద్వారా జెన్నీఫర్ లారెన్స్‌ను ఈ అదృష్టం వరించింది. ‘ది హంగర్ గేమ్స్’, దానికి సీక్వెల్ అయిన ‘క్యాచింగ్ ఫైర్’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల పౌండ్లకు పైగా వసూళ్ళు సాధించడంతో ఈ రికార్డు సాధ్యమైందని ‘టెలిగ్రాఫ్’ పత్రిక పేర్కొంది.

2010 నాటి ‘వింటర్స్ బోన్’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ ‘ఎక్స్ మెన్ – ఫస్ట్ క్లాస్’, దాని సీక్వెల్ అయిన ‘ఎక్స్ మెన్ – డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’, ‘అమెరికన్ హజిల్’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రధాన భూమిక పోషించారు. డేవిడ్ ఓ రస్సెల్ రూపొందించిన ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’లో నటనకు గాను 2013 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైన ఘనత ఈ హాలీవుడ్ నటిది. ఆమెతో పాటు, ఇంటర్నెట్‌లో అత్యధికులు అన్వేషించిన పాప్‌స్టార్‌గా సింగర్ మిలీ సైరస్ కూడా తాజాగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2