టాలీవుడ్

రాజశేఖర్ ఏక్సిడెంట్…కారణం త్రాగుడు కాదు,అసలు కారణం

actor-rajasekhar-narrow-escape-car-accidentరాజశేఖర్‌ మొన్న రాత్రి తన కారుతో యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్కహాల్ తీసుకుని యాక్సిడెంట్ చేశాడని బాధితుడు రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, అసలు విషయం గుర్తించారు. రాజశేఖర్ నిద్రమాత్రలు మింగడంతో మత్తుకు గురై యాక్సిడెంట్ కు కారణమయ్యారని తెలుస్తోంది. దాంతో ఈ ఘటనలో బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాజశేఖర్‌ కారు తానే డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన కారు ఆపారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టు నుంచి హైదర్‌గూడకు వెళ్తున్న రాంరెడ్డి అక్కడ ఆగి ఉన్న కారును గమనించారు. అర్ధరాత్రి వేళ ఏదైనా ఇబ్బంది తలెత్తిందేమోనని తన కారును రాజశేఖర్‌ కారుకు ముందు కొద్దిదూరంలో ఆపి, డ్రైవర్‌ను వెళ్లి చూడమన్నారు. ఇంతలో రాజశేఖర్‌ తన వాహనాన్ని స్టార్ట్‌ చేసి ముందుకు వచ్చి ఆగి ఉన్న రాంరెడ్డి కారును ఢీకొట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఆగ్రహించిన రాంరెడ్డి రాజేంద్రనగర్‌ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఇద్దరినీ ఠాణాకు తీసుకెళ్లారు. అక్కడా వారిమధ్య వాదన జరిగింది. రాజశేఖర్‌ మద్యం మత్తులో ఉన్నారంటూ రాంరెడ్డి ఆరోపించడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆయనకు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించి, మద్యం తాగలేదని నిర్ధరించారు. విషయం తెలుసుకొని ఠాణాకు చేరుకున్న జీవిత.. బాధితుడు రాంరెడ్డితో చర్చించారు. తల్లి చనిపోయిన బాధతో రాజశేఖర్‌ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని వివరించారు. ఇలాంటి సమయంలో ఆయనపై ఫిర్యాదు చేయడం సరికాదని ఆమె వివరించారు. దీంతో రాంరెడ్డి తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.

అసలేం జరిగింది…

రాజశేఖర్‌ తల్లి ఇటీవల మరణించారు. దానిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆయన మూడీగా మారిపోయారు. నిన్న ఆమె కర్మకాండలు జరగాల్సి ఉంది.

ఈ క్రమంలో ఆయన ముభావంగా.. దిగాలుగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, ‘‘చనిపోయిన తల్లి మళ్లీ రాదు. ఇలా ఎన్ని రోజులు డల్‌ గా ఉంటావు? పనిలో పడితే అన్నీ సర్దుకుంటాయి’’ అంటూ హితవుపలికే ప్రయత్నం చేశారు. దీంతో రాజశేఖర్ కు కోపం ముంచుకొచ్చింది.

ఆ తరువాత జరిగిన స్వల్ప వాగ్వాదంతో మరింత ఆగ్రహానికి గురైన రాజశేఖర్ తన కారు (ఏపీ 13ఈ1234 నంబరు) తీసుకుని బంజారాహిల్స్‌ లోని తన ఇంటి నుంచి శంషాబాద్‌ వైపుగా.. అటు నుంచి మెహిదీపట్నం వైపు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవే పైనుంచి వస్తూ నిద్రమాత్రలు వేసుకున్నారు. శివరాంపల్లి పిల్లర్‌ నంబరు 240 వద్ద కారు ఆపి, సిగరెట్‌ తాగి కారును తీసిన కాసేపటికే రాంరెడ్డి కారును యాక్సిడెంట్ చేశారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll