టాలీవుడ్

తెలుగు టీజర్‌ వచ్చింది …కాన్సెప్టు కేక

జయం రవి, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘టిక్‌:టిక్‌:టిక్‌’. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారత సినీ చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా దీన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం తమిళ టీజర్‌కు విశేష స్పందన లభించింది. కాగా తెలుగు టీజర్‌ను హీరో అడివిశేష్‌ విడుదల చేశారు.

‘ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి కోసం ఏ దేశం 20కిలో టన్నులకు మించి న్యూక్లియర్‌ వెపన్‌ను తయారు చేయకూడదని ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఏ దేశం మీదైనా దాడి చేయగలిగే చోట ఒక 200కిలో టన్నుల మిసైల్‌ ఉంది.. భారతదేశం సరిహద్దుల్లో ఎటువంటి దాడులు జరిగినా వాటిని మనం చూస్తూ వూరుకోం..’ అనే డైలాగ్స్‌ టీజర్‌లో వినిపించాయి.

చివర్లో ఓ చిన్నారి జయం రవిని నాన్న అని పిలుస్తూ కనిపించాడు. అనంతరం జయం రవి అంతరిక్షంలో నుంచి కిందకి పడిపోవడాన్ని చూపించారు. ఇలా చాలా ఆసక్తికరంగా టీజర్‌ను రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘టీజర్‌ చూస్తుంటే హాలీవుడ్‌ మూవీని తలపిస్తోంది. ఇండియన్‌ స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రావడం గొప్ప విషయం. ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలుస్తుంది’’ అన్నారు.

సమర్పకుల్లో ఒకరైన లక్ష్మణ్‌ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో వచ్చిన ‘బిచ్చగాడు, 16’ సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు మరో విభిన్నమైన ‘టిక్‌ టిక్‌ టిక్‌’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మంచి టెక్నికల్‌ అంశాలతో పాటు ఎమోషనల్‌ కంటెంట్‌ కూడా ఉంది. తొలి ఇండియన్‌ స్పేస్‌ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, పాటలు: వెన్నెలకంటి, రాకేందు మౌళి, కెమెరా: వెంకటేశ్‌.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16