గాసిప్స్

‘జై లవకుశ’ కథ కి ప్రధాని చేసిన నోట్ల రద్దు లింకుందా?!

jai-modiనోట్ల రద్దు అదేనండీ.. డీమానటైజేషన్‌ …లాస్ట్ ఇయిర్ ప్రధాని మోడీ చేసిన సంచలనం తెలిసిందే కదా. జై లవకుశ కథ ఆ నేపథ్యంలోనే రూపొందిందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డీమానిటైజేషన్‌ సందర్భంగా బ్యాంకులకి వచ్చిన కొత్త నోట్లని విలన్‌ దోచేస్తే, హీరోలు వెళ్లి దానిని సాధించి తెచ్చుకోవడం ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తమని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందో కానీ వినటానికి మాత్రం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.

వాళ్లు చెప్పుకునేదాన్ని బట్టి… ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన మూడు పాత్రల్లో ఒకటైన లవ బ్యాంక్‌ మేనేజర్‌ పాత్ర కీలకంగా ఉండబోతోంది. కుశ ఏమో దొంగ కాగా, జై పెద్ద డాన్‌. ముగ్గురూ అన్నదమ్ములే అయినా కానీ ఎవరి రూట్ ల్లో వాళ్లు వెళ్లి వాళ్లు బ్రతుకుతూంటారు. కథలో ట్విస్ట్ ఏమిటంటే… లవ బ్యాంక్‌కి వచ్చిన కొత్త కరన్సీని కుశ రూపంలో వచ్చి జై కాజేస్తాడట. దీంతో అటు లవ, ఇటు కుశ ఇద్దరూ కేస్‌లో ఇరుక్కుపోతారు. కానీ వారికి జైని ఎదిరించే ధైర్యం వుండదు.

అతడి దగ్గర డబ్బు తెచ్చుకోవడం వెళ్లి వాళ్లిద్దరూ ఎంత కామెడీ చేస్తారు, ఎంతగా ఇబ్బందులు పడతారు, చివరకు జైపై ఎలా పైచేయి సాధిస్తారు అనేది కథ అట. అయితే ఇది లవ బ్యాంక్ మేనేజర్ పాత్ర కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీడియా మిత్రులో లేక తలపండిన సినిమావాళ్లో వండేసిన కథ ఏమో అనే డౌట్ కూడా వస్తోంది. అయితే ఇదే కథ అయినా కాకపోయినా ఇంట్రస్టింగ్ గా ఉంది కదా అందుకే అందిస్తున్నాం.

‘జై లవకుశ’. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్‌టాపిక్‌. ఎన్టీఆర్‌ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇందులో ‘జై’పాత్ర సినిమా మొత్తానికి హైలైట్‌ అని చిత్ర వర్గాల సమాచారం. అందులో ఎన్టీఆర్‌ నటన, నత్తితో డైలాగ్‌లు పలికిన విధానం ఆద్యంతం ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ‘జై’ స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. నాటకాలపై ఇష్టంతో అదీ రావణాసురుడి పాత్రను ఎక్కువ ఇష్టపడే వ్యక్తిగా కనిపించనున్నారని, ట్రైలర్‌ ద్వారా అర్థమవుతోంది. మరి ‘జై’ పాత్రలో ఎన్టీఆర్‌ వెండితెరపై నట విశ్వరూపం చూడాలంటే మరో 24గంటలు ఆగాల్సిందే.

జై.. లవ.. కుశ.. మూడు పాత్రలు కలిస్తేనే చిత్రం పరిపూర్ణమవుతుందని ఎన్టీఆర్‌ చెబుతున్నారు. అతి మంచితనంతో ‘లవ’ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తుంటరి వ్యక్తిగా ‘కుశ’ చేసిన అల్లరి ఏంటి? గంభీరంగా కనపడుతున్న ‘జై’ నేపథ్యం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అంతేకాదు ‘జై’ పాత్రతోనే సినిమా కీలకమలుపు తీసుకుంటుందని సమాచారం.

Comments

comments

Latest

Promo

song

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll