టాలీవుడ్

ఎన్టీఆర్ దొంగ అని రివీల్ అయ్యింది

ఎన్టీఆర్‌ హీరో గా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబి దర్శకుడు. ఈ చిత్రంలో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని మూడో పాత్రైన ‘కుశ’ను పరిచయం చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తే..ఎన్టీఆర్ చేసే కుశ పాత్ర ఓ దొంగ అని తెలుస్తోంది. అమెరికాకు వెళ్దామనే కోరికతో ఉన్న ఆ పాత్ర అందుకోసం డబ్బుని కూడబెడుతుందని తెలుస్తోంది.

టీజర్‌లో తారక్‌.. ‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’ అని చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలోఇన్వెస్ట్‌ చేసి ఆ ఆధార్‌ కార్డేదో నాకు ఇప్పిచ్చేయండి బాబూ’ అని తారక్‌ అంటుంటే.. ‘దాన్ని ఆధార్‌ కార్డు అనరమ్మా గ్రీన్‌ కార్డు అంటారు’ అని చెప్పడం ఫన్నీగా ఉంది.

ఈ చిత్రంలో తారక్‌కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll