కోలీవుడ్

విలన్ గా సిద్దార్ద ..వింటానికి తేడాగా ఉంది కానీ, బాగానే చేసాడట

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్‌. ఆయన తెలుగు, తమిళంతోపాటు పలు హిందీ చిత్రాల్లోనూ నటించారు. కాగా ఆయన త్వరలో మాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి మలయాళ చిత్రం ‘కమ్మర సంభవం’. దిలీప్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రితీశ్‌ అంబట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మొన్న శుక్ర వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్ వస్తోంది సిద్దార్ద పాత్రకి అని తెలుస్తోంది.

ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే.. విలన్ గా సిద్ధార్థ్‌ నటిస్తున్నారు. ఇందులో ఆయన క్యారెక్టరు హీరోకు ధీటుగా ఉంటుందని సమాచారం. అందుకే ఆ క్యారెక్టరులో నటించడానికి సిద్ధార్థ్‌ సమ్మతించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. మలయాళ చిత్రసీమలోనూ ఈ చిత్రం ద్వారా తన అదృష్టాన్ని సిద్ధార్థ్‌ పరీక్షించుకోనున్నారు.

అయితే 2012 సంవత్సరంలో విడుదలైన మలయాళ హిట్‌ చిత్రం ‘ఉస్తద్‌ హోటల్‌’లో నటించే అవకాశం వచ్చిందని సిద్ధార్థ్‌ తాజాగా మీడియాతో చెప్పారు. అన్ని కుదిరి ఉంటే.. ఆ సినిమాతోనే మాలీవుడ్‌కు పరిచయమై ఉండేవాడినని అన్నారు. అప్పుడు వేరే పనుల వల్ల సినిమాలో నటించలేదని పేర్కొన్నారు. ఇందులో అవకాశం వదులుకోవడం తన దురదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.‌

అనంతరం ‘కమ్మర సంభవం’ గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథ విన్నప్పుడు.. ఇదే నా తొలి మలయాళ చిత్రం అని ఫిక్స్‌ అయ్యా. దర్శక, నిర్మాతలు మూడేళ్ల క్రితమే ఈ కథ నాకు చెప్పారు. ఈ సినిమా కోసం చాలా పరిశోధనలు చేశాం. ఈ అనుభూతి సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి కలుగుతుంది. నాకు ఓ పుస్తకం చదివి, పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న భావన కలుగుతోంది. ఈ సినిమా కోసం మలయాళం నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ’ అని ఆయన తెలిపారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16