గాసిప్స్

త్రివిక్ర‌మ్ సినిమాలో ప‌వ‌న్ లుక్ ఇదా ?

PAWANపవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప‌వ‌న్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఇంజ‌నీర్ బాబు, రాజు వ‌చ్చినాడో అనే టైటిల్స్ ని ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ని ఫ్యాన్స్ భావించిన‌ప్ప‌టికి వారికి నిరాశే ఎదురైంది. ఇక ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సెప్టెంబర్ 2న త‌ప్ప‌ని స‌రిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టిల్ ఒక‌టి విడుద‌ల కానుంద‌నే హోప్స్ తో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లోపులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ సినిమాకి సంబంధించిన లుక్ అంటూ ఓ ఫోటో నెట్ లో వైరల్ గా మారింది. ఇక్కడ మీరు చూస్తుున్నది ఇదే.

ఈ ఫొటోలో ప‌వ‌న్ న‌ల్ల‌టి బ‌ట్ట‌లు ధ‌రించి మెడ‌లో శాల్ తో కాస్త కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రానికి సంబంధించిన‌దేనా లేదంటే గ‌తంలో ఎప్పుడో దిగిన ఫోటో ని తీసుకొచ్చి ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారా అనే డౌట్స్ ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి. చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయితేగానీ విషయమై క్లారిటీ రాదు.

ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll