టాలీవుడ్

శ్రీను వైట్ల, రవితేజ కొత్త చిత్రం టైటిల్ ఇదే

Srinu-Vaitla-Next-Movie-Wit-e1497964277425కొద్దిగా గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ వ‌రుస సినిమాలు చేస్తున్న ర‌వితేజ కెరీర్ లో మంచి హిట్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం అమెరికాలో జరిగే ఈ చిత్రం కోసం అమర్ అక్బర్ ఆంధోని అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయటం జరిగింది. శ్రీను వైట్ల మార్క్ కామెడీతో సాగే ఫన్నీ సినిమా అని చెప్తున్నారు.

దర్శకుడిగా శ్రీనువైట్ల ప్రయాణం ‘నీకోసం’తో మొదలైంది. అందులో హీరోగా రవితేజ న‌టించాడు. ఆ త‌రువాత కాలంలో ‘దుబాయ్‌ శీను’తో ఇద్దరూ మంచి హిట్‌ కొట్టారు. ఇప్పుడు వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌ట్టు క‌ట్ట‌బోతున్నార‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం ‘రాజా ది గ్రేట్‌’, ‘టచ్‌ చేసి చూడు’ సినిమాలతో బిజీగా ఉన్న హీరో ర‌వితేజ‌… అవి ఓ కొలిక్కి వ‌చ్చాక ఈ చిత్రంపై దృష్టి సారించే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ హీరో, ద‌ర్శ‌కులిద్ద‌రూ కెరీర్ తొలినాళ్ల‌నుంచీ మంచి మిత్రులు కావ‌డం, వీరిద్ద‌రిదీ మంచి హిట్ కాంబినేష‌న్ కూడా కావటంతో మంచి అవుట్ పుట్ వస్తుందని భావిస్తున్నారు . కెరీర్ లో స‌మాంత‌రంగా ఎదుగుతూ వ‌చ్చిన ఈ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం మంచి స‌క్సెస్ అవ‌స‌ర‌మైన స్థితిలో ఉన్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll