బాక్స్ ఆఫీస్

‘బిచ్చగాడు’హీరో కొత్త చిత్రం రిలీజ్ ఈ నెల్లోనే

తొలి నుంచీ విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ మార్క్‌ను సృష్టించుకున్న తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ. బిచ్చగాడు హిట్ తో తెలుగులో ఆయనకు మార్కెట్ ఏర్పడింది. తాజాగా ఆయన హీరో గా నటించిన చిత్రం ‘ఇంద్రసేన’. జి. శ్రీనివాసన్‌ దర్శకత్వం వహించారు. రాధిక, ఫాతిమా విజయ్‌ ఆంటోనీ నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నవంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘విభిన్నమైన చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్న విజయ్‌ ఆంటోనీకి ప్రేక్షకుల్లో ఆదరణ పెరిగింది. ‘ఇంద్రసేన’ చిత్రంలో బ్రదర్‌ సెంటిమెంట్‌ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అంచనాలను మంచి ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 30న విడుదలకు సిద్ధమౌతోంది’ అని చెప్పారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. ఓ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే వివిధ సంఘటనల గురించి వివరిస్తున్నారు.

‘నేరుగా వెళ్లి రైట్‌ తీసుకుంటే ఒక ఓటమి ఎదురౌతుంది.. దాన్నుండి లెఫ్ట్‌కి వెళితే పెద్ద నమ్మక ద్రోహం కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్లి యూటర్న్‌ తీసుకుంటే నువ్వు తీసుకున్న అప్పు అనే లోయ కనిపిస్తుంది. ఆ లోయలోపడి ముక్కు, ముఖం పగలగొట్టుకుని లేచి ముందుకెళ్తే మనం మోసపోయామనే ఒక సిగ్నల్‌ పడుతుంది. ఆ సిగ్నల్‌ని కూడా టాప్‌ గేర్‌ వేసి దాటి వెళితే ఆ తర్వాత వచ్చే ఇల్లే నువ్వు కోరుకున్న విజయం. ఆ విజయాన్ని అందుకుని వెనక్కి తిరిగి చూస్తే యముడు మనకన్నా ముందొచ్చి మనకోసం నిల్చుని ఉంటాడు’ అంటూ ఇంట్రస్టింగ్ గా ఈ ట్రైలర్‌ సాగింది.

Comments

comments

Trailer

Latest

Recent

Coming Soon

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
లండన్ బాబులు

Now Showing

నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03
ఉన్నది ఒకటే జిందగీ OCT 27
రాజా ది గ్రేట్ OCT 18
రాజు గారి గది 2 OCT 13

Poll