బాలీవుడ్

షాకిచ్చే ట్విస్ట్… ఆస్కార్ కు ఎంపికైన సినిమా కాపీ కొట్టిందా?

Newtonఆస్కార్ అవార్డు కోసం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి బాలీవుడ్ ‘న్యూటన్’ సినిమా నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే 2001 లో వచ్చిన ఇరానియన్ సినిమా ‘సీక్రెట్ బాలెట్’ ను మక్కీ టు మక్కీ కాపీ కొట్టి ‘న్యూటన్’గా తీశారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీన్ని ‘న్యూటన్’ డైరెక్టర్ అమిత్ మసుకర్ తప్పుబట్టాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే… ప్రతిష్టాత్మక ఆస్కార్ రేసులో రాజ్‌కుమార్ రావు నటించిన ఇండియ‌న్ మూవీ న్యూటన్ ఉత్తమ విదేశీ చిత్రం కేట‌గిరిలో సెల‌క్ట్ అయింది. ఈ కేట‌గిరిలో భార‌త్ నుండి దాదాపు 26 సినిమాలు రేసులో నిలవ‌గా, చివ‌రికి ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా న్యూట‌న్‌ని ఎంపిక చేసింది. అయితే ప్ర‌స్తుతం ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటికి హెడ్‌గా ఉన్న తెలుగు నిర్మాత సి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని ఉత్త‌మ విదేశీ చిత్రంగా ఎంపిక చేయ‌డం విశేషం.

ఈ ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వర్షం కురిపించిన బాహుబ‌లి2 , దంగ‌ల్, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు న్యూటన్ ముందు తేలిపోయాయి. అమిత్‌ వి.మసుర్‌కర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన న్యూటన్ చిత్రం కి పలువురు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు ల‌భించాయి.ఆస్కార్ రేసులో న్యూటన్ నిలవడంతో చిత్ర టీం ఫుల్ ఆనందంలో ఉంది.

ఇదిలా ఉంటే 2001లో వచ్చిన ఇరానియన్‌ చిత్రం సీక్రెట్‌ బాలెట్‌ను మక్కికి మక్కీ దించేశాడని చెప్పుకుంటున్నారు. అందుకు ఆయా రెండు చిత్రాల్లోని సన్నివేశాలను పోల్చేస్తున్నారు. రెండు చిత్రాలు కూడా ఎన్నికల నేపథ్యంలోనే తెరకెక్కినవే. పైగా ప్రధాన పాత్రలు ఎన్నికల అధికారి పాత్రలు పోషించాయి. వారికి తోడుగా ఓ సైనిక అధికారి ఉండటం అనే కామన్‌ పాయింట్‌ కూడా ఉంది.

రెండింటిల్లోనూ కష్టాలు ఎదుర్కునే లీడ్‌ రోల్స్‌ కష్టాలను అధిగమించి విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తాయి. ఇలా దాదాపు అన్నీ సిచ్యువేషన్లు, సీన్లు ఒకేలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఈ కాపీ కామెంట్లను న్యూటన్‌ చిత్ర దర్శకుడు అమిత్‌ మసుకర్ ఖండించారు. సినిమాను సీక్రెట్‌ బ్యాలెట్‌ నుంచి తాను కాపీ కొట్టలేదని, పైగా ప్రేరణ కూడా పొందలేదని ఆయన చెబుతున్నారు.

‘‘న్యూటన్‌ నేను సొంతంగా రాసుకున్న కథ. సినిమా షూటింగ్‌ మొదలుపెట్టడానికి కొన్ని రోజుల ముందు నా స్నేహితుడొకరు సీక్రెట్‌ బ్యాలెట్‌ చిత్రం గురించి నాకు చెప్పాడు. యూట్యూబ్‌లో ఆ చిత్రం వీడియోలను చూస్తే ఆశ్చర్యం వేసింది. కాస్త పోలికలు ఉన్నప్పటికీ.. తేడాలను కూడా గమనించాను. అందులో లీడ్‌ పాత్ర మహిళ పోషించగా.. ఇక్కడ మాత్రం రాజ్‌ కుమార్‌ రావు పోషించారు. అక్కడ రొమాన్స్‌ ట్రాక్‌ ఉంటే.. ఇక్కడ లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు ఇలాంటి విమర్శలు వినిపిస్తాయని నాకు తెలుసు. కానీ, ఏం చేయగలను? అలా జరిగిపోయింది’’ అని అమిత్‌ వివరణ ఇచ్చారు.

న్యూటన్ చిత్రం బ్లాక్ కామెడీ తరహా సినిమాగా రూపొందగా, చత్తీస్ ఘడ్‌లో జరిగిన ఎన్నికలలో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీస‌ర్‌ కథే ఈ సినిమా. ఈ చిత్రంలో ఎన్నికలు స‌జావుగా జరగనివ్వకుండా గూండాలు, రౌడీలు అడ్డుపడుతుంటే , వారిని న్యూట‌న్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది చూపించారు. ఈ చిత్రంలో రాజ‌కీయ‌ప‌ర‌మైన కామెంట్లు కూడా ఉన్నాయ‌ని తెలుస్తుంది. మావోయిస్టులు దాడి చేస్తార‌ని తెలిసినా… ఎన్నిక‌ల‌ను నిష్పాక్షికంగా నిర్వ‌హించాల‌న్న ల‌క్ష్యంతో రాజ్ కుమార్ రావు పాత్ర చేసే ప్ర‌య‌త్న‌మే న్యూట‌న్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాకి మ‌నీష్ ముంద్ర క‌థ‌ని అందించారు. పంక‌జ్ త్రిపాఠి, అంజ‌లి పాటిల్‌, ర‌ఘువీర్ యాద‌వ్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్ర‌లుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దృశ్యం ఫిలింస్ నిర్మించింది.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll