టాలీవుడ్

‘లలిత ప్రియకమలం..’ పాట ఎలా పుట్టిందంటే…

ilai2‘రుద్రవీణ’లోని ‘లలిత ప్రియకమలం..’ పాట బాణీ వెనక కథని వివరించారు ఇళయరాజా. ‘‘ఈ పాట వూరికే రాలేదు. సినిమాలో హీరోయిన్ ని పేరు అడుగుతాడు హీరో. ఆమె మాత్రం పేరు చెప్పకుండా రాగం పాడి వెళ్లిపోతుంది. ఆ రాగమే ఆ అమ్మాయి పేరు అనీ, ఒక అమ్మాయి పేరుతో కూడిన రాగంలోనే పాట కట్టాలని దర్శకుడు బాలచందర్‌ చెప్పారు. మీరు ఏ రాగంలో బాణీ కడితే ఆ రాగం పేరే హీరోయిన్ కి పెడతా అన్నారు. దాంతో హిందూస్థానీ రాగంలోని లలిత ప్రియరాగంలో ఈ పాట కట్టా. అదే లలిత ప్రియకమలం అయింది. నా జీవితంలో జరిగిన లక్షల టసంఘటల్లో ఒక చిక్కని సంఘటన ఇది’’ అని ఆ రోజుల్ని గుర్తు చేసుకొన్నారు

లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా నవంబరు 5న గచ్చిబౌలి అథ్లెటిక్‌ స్టేడియంలో సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇళయరాజా 6 వేల పాటలకుపైగా స్వర రచన చేశారు. వెయ్యికిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన భాగ్యనగరంలో ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. చిత్ర, మనో, సాధనాసర్గమ్‌, కార్తిక్‌ తదితర ప్రముఖ గాయనీగాయకులు ఈ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు. తాజ్‌బంజారాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వాహక సంస్థ ఈ కార్యక్రమ వివరాలు వెల్లడించింది.ilai

ఈ సమావేశంలో ఇళయరాజా కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో గతంలో తానెప్పుడూ ప్రదర్శన ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

‘‘నా సంగీతం అంటే తెలుగువాళ్లందరికీ ఎంతో ప్రేమ. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడ ఎక్కువ ప్రేమని ప్రదర్శిస్తుంటారు. వాళ్లని చూడగానే తెలిసిపోతుంది ఆ వాత్సల్యం. గౌరవంతో కూడిన ఓ ప్రత్యేకమైన వాత్సల్యం అది’’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఇళయరాజా.

ఇళయరాజా మాట్లాడుతూ ‘‘తొలిసారి హైదరాబాద్‌లో తెలుగు పాటల సంగీత ప్రదర్శన చేయనుండడం ఆనందంగా ఉంది. సంగీత ప్రియులందరి కోసం ఈ ప్రదర్శన. ఇరవై, ముప్ఫైయ్యేళ్లుగా నా పాటల్ని రికార్డుల్లో వినీ వినీ అలవాటైంది అందరికీ. వాళ్లని ప్రత్యక్షంగా అలరించాలనే ఈ సంగీత ప్రదర్శన. ఇలాంటి ప్రదర్శనల వెనక చాలా కసరత్తే ఉంటుంది. ఆర్కెస్ట్రా బృందంతో కలిసి ముందస్తుగా సన్నాహాలు చేసుకోవాలి, అందులో తప్పులు దొర్లినట్టు అనిపిస్తే వాటిని సరిచేసువాలి. ఆ తర్వాతే ప్రదర్శన జరగాలి. అభిమానులందరికీ ఒక అద్భుతమైన అనుభూతిని పంచేలా ప్రదర్శన చేయబోతున్నాం’’ అన్నారు.

ఇళయరాజా. బుక్‌మైషో.కామ్‌ ద్వారా సంగీత ప్రదర్శన కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్లని పొంద వచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll