బాలీవుడ్

నేనేమీ పబ్లిక్‌ ప్రాపర్టీని కాను,ఒళ్లు దగ్గరపెట్టుకోండి

ileanaప్రముఖ ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్, ఇలియానా ఎప్పట్నుంచో డేటింగ్‌ (సహ జీవనం) చేస్తున్నారు. ఇద్దరూ కలసి షికార్లకు వెళతారు. ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అయితే తన బోయ్ ఫ్రెండ్ విషయంలో వేరే వాళ్ళ జోక్యం ఆమె ఇష్టపడదు. ముఖ్యంగా అతని జాతి గురించి సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ పై ఆమె మండిపడుతోంది. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్లినా సినిమాల గురించి కాకుండా మీడియా తన బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌ గురించే అడుగుతున్నారట. ఈ విషయమై ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.Shahid-Kapoor-Ileana-Phata-Poster-Nikla-Hero-Hindi-Movie-Stills-8

‘ఇప్పటివరకు నా విషయంలో జరిగింది నాకు బాధ కలిగించింది. నలుగురిలో ఉన్న ప్రతిసారీ నవ్వుతూనే కనిపించలేను. నేను పబ్లిక్‌ ఫిగర్‌ని. పబ్లిక్‌ ప్రాపర్టీని కాను. నేను చేస్తున్నది తప్పు అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. మిగతా మగవారంతా తమ భార్యలు, తల్లుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తున్నారా? మరి నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనూ అమ్మాయినే కదా? మీ ఇంట్లో ఆడవారికి ఇచ్చే గౌరవం నాకెందుకు ఇవ్వరు? నా బాయ్‌ఫ్రెండ్‌ గురించి అడగడంలో తప్పులేదు. కానీ చాలా మంది అతని జాతి గురించే అడుగుతున్నారు. అతను తెల్లగా ఉంటాడు కాబట్టే నేను డేటింగ్‌ చేస్తున్నానని అంటున్నారు. అదొక్కటే నాకు నచ్చని విషయం.’ అని మండిపడింది ఇలియానా.Saif-Ali-Khan-Ileana-Happy-Ending-Movie-Promotions-Stills-9

దక్షిణాదికి భిన్నంగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఇలియానా గత కొంతకాలంగా నటనకు ఆస్కారమున్న పాత్రలవైపు మొగ్గుచూపుతున్నది. అవకాశాలొస్తే దక్షిణాది చిత్రాల్లో నటించాలనుకుంటున్నానని, ఇలియానా నటించిన ‘బాద్‌షాహో’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే రూ.50 కోట్లు వచ్చాయి.మంచి కథల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది ఇలియానా.

Ileana-Stills-At-New-Range-Of-Skechers-Go-Flex-Launch-6

Ileana-Stills-At-LFW-Winter-Festive-2014-7

Ileana-Stills-At-Lakshmi-Raave-Maa-Intiki-Audio-Launch-15

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll