టాలీవుడ్

శ్రీదేవికు వర్మ రాసిన ఈ లవ్ లెటర్ ..ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం

 

శ్రీదేవి మరణవార్త విని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విటర్‌లో బాధతప్త హృదయంతో స్పందించిన తీరిది. ‘కేవలం శ్రీదేవిని దగ్గరగా చూడటానికే నేను సినిమాల్లోకి వచ్చాను. అతిలోక సుందరికి ‘క్షణక్షణం’ సినిమానే నేను రాసిన లవ్‌ లెటర్‌’ అని ఆమెపై తన ప్రేమను చాటుకున్నాడు వర్మ.

‘శ్రీదేవి నిజంగా చనిపోయిందా? ఎవరైనా ఒకరు నన్ను నిద్రలోంచి లేపి అది ఓ పీడ కల అని చెప్పండి’ అని తన ఆవేదనను పంచుకున్నారు వర్మ. శ్రీదేవి ఇకలేరు అని తెలియగానే దేవుడిని ద్వేషిస్తున్నానంటూ వర్మ తన ట్విటర్‌లో స్పందించారు.

‘‘నాకు నిద్రలో తరచూ కలలు కనే అలవాటు ఉంది. అప్పుడప్పుడు మధ్యలో లేచి నా మొబైల్‌ ఫోన్‌ను చెక్‌ చేసుకునే నేను.. శ్రీదేవి ఇక లేరు అనే మెసేజ్‌ ఒకటి చూశాను. అయితే అది నాకు వచ్చిన పీడకల లేదా ఏదో తప్పుడు వార్త అయి ఉంటుంది అని భావించి మళ్లీ నిద్రలోకి జారుకున్నా. ఓ గంట తర్వాత లేచి చూస్తే అలాంటివి 50 మెసేజ్‌లు ఉన్నాయి నా ఫోన్‌లో. షాక్‌కు గురయ్యా.’’

‘‘విజయవాడలో ఇంజినీరింగ్‌ చదువుతున్న రోజులవి. శ్రీదేవి నటించిన ‘పదహారేళ్ల వయస్సు’ సినిమా చూశాను. ఆమె అందం చూసి మైమరచిపోయా. ఆమె నిజంగా అతిలోక సుందరి. మనల్ని దీవించడానికి వేరే ప్రపంచం నుంచి మన భూమిపైకి వచ్చిందని భావించా. ఆమె అందానికి ముగ్ధుడినయ్యా’. ఆమె దేవుడు సృష్టించిన అద్భుతం. దేవుడు మానవాళికి ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి శ్రీదేవి.’’

శ్రీదేవితో ప్రయాణం అలా మొదలైంది..
‘‘అవి ‘శివ’ సినిమా తీస్తున్న రోజులు. చెన్నైలో నాగార్జున ఆఫీస్‌కు వెళ్తుండేవాడిని. ఆ పక్క వీధిలోనే శ్రీదేవి ఇల్లు ఉండేది. ఆ ఇంటి గేటు బయట నిల్చుని శ్రీదేవి నివాసాన్ని చూశా. ఇలాంటి నివాసంలో ఓ దేవలోక సుందరి నివసిస్తుందా? అని నమ్మలేకపోయా. ఆమె ఇంటి నుంచి ఎప్పుడూ బయటకు వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని నాలో ఆతృత పెరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఆ దేవత దర్శనం నాకు కలగలేదు.’’rgv

నీకు పిచ్చి పట్టిందా అని అడిగా..
‘‘శివ’ పెద్ద హిట్‌. ఆ తర్వాత చాలా మంది నిర్మాతలు నా వద్దకు వచ్చేవారు. అందులో ఓ నిర్మాత శ్రీదేవితో సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా? అని అడిగాడు. నేను వెంటనే ‘నీకు ఏమైనా పిచ్చి పట్టిందా.. ఆమె కోసం నా ప్రాణాలనైనా అర్పిస్తా. నేను ఒక్కడినే ఆమెతో సినిమా తీస్తా’ అని అరిచాను. వెంటనే అతను శ్రీదేవితో మీటింగ్‌ ఏర్పాటు చేసి నేను గేటు బయట ఎదురుచూసిన ఆ ఇంటికే తీసుకుపోయాడు. ’’

వెలుతురులో మెరుపులా ఆమె కనిపించింది..
‘‘రాత్రి సమయంలో మేం వారి ఇంటికి వెళ్లాం. మా దురదృష్టం ఏంటంటే అప్పుడే కరెంట్‌ పోయింది. క్యాండిల్‌ వెలుతురులో మేం ఆ ఇంట్లోని లివింగ్‌ రూమ్‌లో వెయిట్‌ చేస్తున్నాం. ఆమె ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చూద్దామా అని నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ‘ఆమె ముంబయి ప్రయాణం కోసం సిద్ధమవుతోంది. బిజీగా ఉంది అని’ వాళ్ల అమ్మ వచ్చి మాకు చెప్పింది. ఆ తర్వాత శ్రీదేవి ఓ రూమ్‌లోంచి ఇంకో రూమ్‌లోకి వెళ్తూ మాకు కనిపించింది. ఆ చీకట్లోనే ఓ వెలుతురు వచ్చి మాయమైనట్లు నాకు కనిపించింది. కాసేపటికే మా ముందుకు వచ్చి కూర్చొని మాతో ముచ్చటించింది. మాతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పి ముంబయి వెళ్లిపోయింది. ఓ అతిలోక సుందరికి జన్మనిచ్చిన ఆమె తల్లి పట్ల నాకు ఎంతో గౌరవం కలిగింది. చాలాసార్లు ఆమెతో నేను మాట్లాడా. ఆ రాత్రి చీకటిలో క్యాండిల్‌ లైట్‌ వెలుతురులో శ్రీదేవి రూపం నా మదిలో ఓ గొప్ప చిత్రంగా ప్రింట్‌ అయింది. ఆ చిత్రాన్ని ఊహించుకుంటూ ‘క్షణక్షణం’ సినిమాకు స్క్రిప్ట్‌ రాయడం మొదలు పెట్టా.

కేవలం శ్రీదేవి కోసమే ఆ సినిమా తీశా. ఆ సినిమా నేను ఆమెకు రాసిన ప్రేమ లేఖ. ఆ సినిమా తీస్తున్నంత సేపూ ఆమె వైపే చూస్తుండేవాడిని. ఆమె నటన, అందం, అభినయం నాపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. ’’

వెంకటేశ్‌ అడ్డుకున్నాడు..
‘‘క్షణక్షణం సినిమా షూటింగ్‌ సమయంలో ఓ అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చినందుకు నేను శ్రీదేవి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించా. తన కాళ్లకు దండం పెడుతుంటే అక్కడ ఉన్న హీరో వెంకటేశ్‌ అలా చేయొద్దని నన్ను అడ్డుకున్నాడు.’’

శ్రీదేవి కోసం బ్యాంకులు, కార్యాలయాలు మూతపడ్డాయి..
‘‘క్షణక్షణం’ సినిమా క్లైమాక్స్‌ను నంద్యాలలో తీస్తున్నాం. తమ ఊరికి శ్రీదేవి వచ్చిందని తెలుసుకొని ఆమెను చూడటానికి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. బ్యాంకులు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి ఆ రోజు. ఆమెను ఒక్కసారి చూస్తే చాలు అనుకొని జనం భారీ సంఖ్యలో ఎగబడ్డారు. ఆమె బస చేసే బంగ్లా చుట్టూ దాదాపు 20 వేల మంది గుమిగూడారు. ఆమె దర్శనం కోసం రాత్రంతా వారు అక్కడే జాగారం చేశారు కూడా. దీంతో ఆమెకు రక్షణగా 150 మంది పోలీసులతో అక్కడ భద్రత ఏర్పాటు చేశాం. శ్రీదేవికి ఉన్న ఆదరణను చూసి ఆశ్చర్యపోయా. ఆమె కారులో వెళ్తుంటే.. ఆ కారు వెనక భారీగా దుమ్ము వచ్చేది. ఎందుకంటే వేలాది మంది అభిమానులు ఆ వాహనం వెంట పరిగెత్తేవారు.’’

‘‘శ్రీదేవి నిజంగా ఓ అందమైన రూపం. ఆమెను సృష్టించినందుకు దేవుడికి కృతజ్ఞతలు. వెయ్యి ఏళ్లకోసారి మాత్రమే ఇలాంటి అద్భుత సృష్టి జరుగుతుందని నమ్ముతున్నా. ఆమె మన ముందు లేకపోయినా.. ఆమె అందాన్ని, అభినయాన్ని మా కెమెరాల్లో బంధించే అదృష్టం డైరెక్టర్‌గా నాకు దక్కింది. దేవుడు శ్రీదేవిని సృష్టిస్తే.. ఆమెను శాశ్వతంగా బంధించేందుకు లూయిస్‌ లూమియేర్‌ సినిమా కెమెరాను మా కోసమే సృష్టించాడు. ఆమె మరణించిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా. బెడ్‌పై ఉండే ఆమె జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నా’’ అని రామ్‌గోపాల్‌ వర్మ తన ట్విటర్‌లో స్పందించారు.

‘‘నేను ఇంకా ఒక పీడకలలోనే ఉన్నానని భావిస్తున్నా. కానీ నాకు తెలుసు అది నిజం కాదని..’’
‘‘శ్రీదేవిని నేను ఈ రోజు ద్వేషిస్తున్నా. ఆమె కేవలం ఒక మానవ మాత్రురాలేనని.. ఆమె చనిపోతుందనే నిజాన్ని అసహ్యించుకుంటున్నా.’’
‘‘ఇతరుల మాదిరిగానే ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోతుందన్న విషయాన్ని ద్వేషిస్తున్నా.’’
‘‘ఆమె మరణవార్తకు సంబంధించి మెసేజ్‌లను చూడటాన్ని నేను ద్వేషిస్తున్నా.’’
‘‘ఆమెను తీసుకుపోయినందుకు దేవుడిని ద్వేషిస్తున్నా.’’
‘‘ఐ లవ్‌ యూ శ్రీదేవి. నీవు ఎక్కడ ఉన్నా.. నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా.’’

-రామ్‌గోపాల్‌వర్మ

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2