టాలీవుడ్

మహేష్ కత్తి పై ‘హైపర్’ ఆది సెటైర్స్

aadi-kattimaahesshపవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గురించి సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన వద్ద అసలు డబ్బులే లేవని చెబుతున్నారు. మరి పబ్లిక్ పంక్షన్లకు ఖర్చు పెట్టేందుకు డబ్బెలా వస్తుందని అడిగాడు. అంతేగాకుండా పవన్ కల్యాణ్ నటన, రాజకీయ జీవితం, అతని అభిమానుల తీరుపై కత్తి మహేష్ చాలా విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో కత్తి వ్యాఖ్యలపై తాజాగా జబర్దస్త్ తో పాపులర్ అయిన ఆది సైటైర్స్ వేసి నవ్వించారు.

మహేష్ కత్తి క్యారెక్టర్ ని సుత్తి రాజేష్ గా మలచి అతనిపై పంచులు మీద పంచులు వేసాడు. సుత్తి రాజేష్ గడ్డాన్ని చూసి ఏంటి రా ఇది బార్బర్ షాప్ వాడు సగమే గొరిగాడా ఏంటి , నీది నువ్వు ఫుల్ గా గోక్కోలేవు , పక్కనోళ్ళని గోకడం మనకి అవసరమా అంటూ ఇండైరెక్టుగా మహేష్ కత్తి ఫై కామెంట్ చేసాడు ఆది. అలాగే సుత్తి రాజేష్ ఫోన్ తెచ్చి ఆది కి చూపించి ఫాన్స్ అన్నాడు ఎవరి ఫాన్స్ అంటే , ఎవరెవరో ఫాన్స్ అంటూ మ ళ్లి పంచ్ వేసాడు. దేవుడిని గెలికాప్ నీకు దేతడి, పోచమ్మ గుడే దిక్కు అంటూ మహేష్ కత్తి ఫై పంచులు వర్షం కురిపించారు.

కాగా గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి మహేష్‌ల మధ్య వార్ జరుగుతోంది. ఆ యుద్ధానికి సోషల్ మీడియా వేదికైంది. పవన్‌పై విమర్శలు, రాజకీయ జీవితంపై సెటైర్లు వేసిన కత్తి మహేష్‌పై పవన్ ఫ్యాన్సుకు విపరీతమైన కోపం కట్టలు తెంచుకుంది.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll