టాలీవుడ్

దటీజ్ రజనీ పవర్… కుక్కకు కోట్లు పలుకుతోంది

kalaప్ర‌తి కుక్క‌కి ఓ రోజు వ‌స్తుందని మన వాళ్ళు అన్నట్లుగానే ఆ కుక్క మణికి కూడా ఓ రోజు వచ్చింది. సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ 164వ చిత్రం కాలాలో క‌నిపించినందుకు మ‌ణి అనే కుక్క‌కి భారీ డిమాండ్ ఏర్ప‌డింది. రెండు నుండి మూడు కోట్లు అయిన ఇచ్చి మ‌ణిని ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్నార‌ని సమాచారం. ముఖ్యంగా రజనీ అభిమానులు ఎంత రేటైన్ పెట్టి ఆ కుక్కను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

ర‌జినీకాంత్‌తో చాలా రోజుల పాటు షూట్‌లో పాల్గొన్న ఈ కుక్క అంటే ర‌జినీకాంత్‌కి కూడా చాలా ఇష్ట‌మ‌ట‌. దాని కోసం ప్ర‌త్యేకంగా బిస్కెట్స్ కూడా తెచ్చేవారటని మీడియాలో వార్తలు రావటంతో ఈ కుక్కపై క్రేజ్ రెట్టింపు అయ్యింది.

కాలా సినిమా కోసం 30 కుక్క‌ల‌ని ప‌రిశీలించిన త‌ర్వాత చివ‌రికి మ‌ణిని సెల‌క్ట్ చేశాడ‌ట ద‌ర్శ‌కుడు పా.రంజిత్ . మ‌ణి చెన్నైలోని రోడ్ పైన త‌న‌కి దొరికిందని చెప్పిన సిమ‌న్ దీనిని అమ్మేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. ప్ర‌స్తుతం కుక్క వ‌య‌స్సు రెండు సంవ‌త్స‌రాల ఆరు నెల‌లు కాగా, ప‌లు సినిమాల‌లో న‌టించింది మ‌ణి అనే కుక్క‌. మెహిందీ స‌ర్క‌స్‌, సిమ‌న్ క్లైమ్స్ అనే చిత్రాల‌లోను మ‌ణిని మ‌నం చూడొచ్చు.

ఇక రీసెంట్ గా సూపర్‌స్టార్‌ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కాలా’ టీజర్ విడుద‌లైంది. టీజ‌ర్‌లో ర‌జ‌నీ స్తైల్‌, డైలాగులు, యాక్ష‌న్ సీన్లు అల‌రించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో రజనీ..కరికాలన్‌ అనే డాన్‌ పాత్రలో నటించారు. వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ధనుష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పా రంజిత్‌ దర్శకత్వం వహించారు.

టీజర్‌లో.. విలన్ పాత్రలో నటిస్తున్న నానా పాటేకర్‌..‘కాలా..ఇదేం పేరు’ అంటాడు. అప్పుడు ‘కాలా అంటే నలుపు. కరికాలన్‌ అంటే గాడ్‌ ఆఫ్‌ డెత్‌. రక్షించడానికి పోరాడేవాడు.’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ ఆకట్టుకుంటోంది. ‘నేనొక్కడినే వచ్చాను. దమ్మున్నోడు రండిరా.. మీరింకా నా పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు. చూస్తారు’ అని రజనీ స్టైల్‌గా చెప్తున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

కాలా చిత్రీకరణ ఎక్కువ భాగం ముంబయిలో చోటుచేసుకుంది. ఇందులో బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ రజనీకి జోడీగా నటించారు. నానా పటేకర్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

ఏ మంత్రం వేసావె MAR 9
కిరాక్ పార్టీ MAR 16
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2