సినిమా కళ

ఐ-ఫోన్ తో హాలీవుడ్ స్టయిల్?

unnamed-3-ఫోన్ తో హాలీవుడ్ స్టయిల్ షార్ట్ తీయవచ్చా? తీయడమే కాదు, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలాగంటారా? అయితే పదండి, ‘ఆల్ అప్ టు యూ’అనే అమెరికన్ షార్ట్ ఎక్స్ పెరిమెంట్ ని చూద్దాం… మాజేక్ పిక్చర్స్ కి చెందిన అన్నా ఎలిజబెత్ జేమ్స్, మైకేల్ కోర్బెల్ లు కలిసి ఐ-ఫోన్ 5 తో 96 సెకెన్ల వీడియో షూట్ చేసి, ఐ-ఫోన్ మీద ఎడిట్ చేశారు. మినీ మూకీలాగా రూపొందించిన ఈ షార్ట్ ని అవుట్ డోర్ లో చిత్రీకరించారు. ఎడారి ప్రాంతంలో పెట్రోలు అయిపోయి అతడి కారాగిపోవడంతో ప్రారంభమవుతుందీ షార్ట్. దీన్ని తీయడానికి పది గంటల సమయం పట్టింది. ‘ఫిల్మిక్ ప్రో 2’ యాప్, ‘ఐ-ఫోన్ 5 విత్ ఐ మూవీ’ ల నుపయోగించి షూట్ చేశారు. షూట్ సమస్య కాలేదుగానీ, ఫోన్ స్క్రీన్ మీద ఎడిట్ కష్ట మనిపించింది. ఐతే ఈ ఎడిట్ పూర్తిగా బేసిక్స్ తో కూడి వుండడం పనిని అంతే సులభతరం చేసింది. స్మాల్ స్క్రీన్ ఒకటే అవరోధం. అలాంటప్పుడు ఫోన్ లో ఎందుకు ఎడిట్ చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరి జేబులో సెల్స్ కి ఫోన్ లు ఉంటున్నాయి. కాబట్టి కొత్త తరం వారికి ఐఫోన్ తో ఏం చేయవచ్చో, ఐ ఫోన్ తో వాళ్ళు తీసే వీడియోలని ఇంకెక్కడికీ వెళ్ళకుండా స్పాట్ ఎడిట్ చేసుకుని బాహ్య ప్రపంచంతో ఎలా షేర్ చేసుకోవచ్చో చూపించడానికే ఈ ప్రయోగం చేసినట్టు చెప్పారు. ఇప్పుడు ఫిలిం మేకింగ్ శకం వచ్చేసి మొబైల్ మూవీ మేకింగ్ విప్లవంగా మారిందనీ, అంతే గాక యూ ట్యూబ్, షోలు, వైరల్ వీడియోలు ధూమ్ ధాం చేస్తున్న సందర్భంలో ‘స్టూడియో’ అనేది మన జేబులో ఉంటేనే సుఖమనీ చెప్పారు. ఈ మేరకు ‘డి స్టూడియో ఇన్ యువర్ పాకెట్’ అనే పుస్తకం కూడా రాశారు.
ఈ షార్ట్ కి ఎడిట్ ఎనలాగ్ ప్రాసెస్ తో ప్రారంభమైంది. తాము అత్యధికంగా ఇష్ట పడ్డ ప్రతిఒక్క మూవ్ మెంట్ నీ ఇండెక్స్ కార్డుల మీద నోట్ చేసుకున్నారు. దాంతో స్మాల్ స్క్రీన్ మెడ ఆ షాట్స్ ని గుత్రించడం ఈజీ అయింది. వీళ్ళిద్దరూ ఐ ఫోన్ 4 తో కూడా షూట్ చేసి , ఐపాడ్ 2 ని ఎడిట్ స్టేషన్ గా ఉపయోగించుకున్నారు. ఐఫోన్ 5 విషయానికొస్తే, సాంప్రదాయ కెమెరాలతో షూట్ చేసే దానికన్నా చాలా ఫన్ గా వుంటుంది. ఇందులో వున్నా ఫిలిం మేకింగ్ యాక్సెసరీస్ అయితే ఇంకా ఫన్ గా ఓ ఆటలాగా మార్చేస్తాయి మూవీ మేకింగ్ ఎక్స్ పీరియెన్స్ ని!unnamed-2

ఈ యాప్స్ తో ఫాస్ట్ యాక్షన్!
ఐఫోన్, ఐ పాడ్ లలో దినాదినభి వృద్ధి చెందుతున్న ఫీచర్స్ వల్ల యూజర్లు వాటితో తమ జీవితాల్లో చిరస్థాయిగా నిలిచి పోయే ఘట్టాలను చిత్రీకరించుకుని భద్ర పర్చుకునే వీలు కలుగుతోంది. ఇక అదనంగా ఈ హేండ్ సెట్స్ కి అప్లికేషన్ వనరులుగా వివిధ వైవిధ్య భరిత యాప్స్ కూడా అందుబాటులోకి వస్తూండడంతో చిత్రీకరణ సామర్ధ్యాన్ని మరింత ప్రొఫెషనల్ గా నిరూపించుకునే అవకాశం అందివస్తోంది. ఈ యాప్స్ ఇచ్చే గైడెన్స్ తో ఆత్మవిశ్వాసం పెరిగి పనితనంలో నాణ్యతని పెంచుకోవచ్చు. అంతేగాక షార్ట్ ఫిలిమ్స్ తీసే ఆసక్తి వుంటే, ఈ యాప్స్ ఆ ఆసక్తిని మరింత సులభతరం చేస్తాయి. అటువంటి విలక్షణ యాప్స్ కొన్నింటిని గురించి ఈ క్రింద తెలుసుకుందాం :
1) స్టోరీ బోర్డ్స్ ప్రీమియం : ఎలాటి డ్రాయింగ్ అనుభవంలేకున్నా స్టోరీ బోర్డు సృష్టికి ఇది చక్కని యాప్స్. ఇందులో వందలాది క్యారక్టర్లు, ప్రాప్స్ నిక్షిప్తమై వున్న కారణంగా క్షణాల్లో షాట్స్ ని కంపోజ్ చేసుకోవచ్చు. రిచ్ టచ్ ఇంటర్ఫేస్ ఇందుకు ఎంతగానో తోడ్పడుతుంది.
2) టైం లాప్స్ కెమెరా : ఇది 16.9 హెచ్ డీ టైం లాప్స్ వీడియోలని తక్షణం డివైస్ లో ప్రదర్శిస్తుంది. కంప్యూటర్ కోసం వెతుక్కోనవసరం లేదు,సమయం వృధా చేసుకో నవసరం లేదు.
తక్షణ ప్లేబ్యాక్ సౌకర్యం వుంది. అద్భుత చలన చిత్రాల్ని దీని ద్వారా ఆవిష్కరించి యూట్యూబ్, ఫేస్ బుక్ ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ నుంచి ఐ మూవీస్ లోంచి కూల్ థీమ్స్ ని, టైటిల్స్ ని, సౌండ్స్ ని, ట్రాన్సి షన్స్ ని కూడా పొందవచ్చు.
3)టిల్ట్ షిఫ్ట్ వీడియో : ఈ యాప్ ఐ ఫోన్, ఐ పాడ్ టచ్, లేదా ఐ పాడ్ లలో గల ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని వినియోగించుకుని, తక్షణం వీడియోలకి, ఫోటోగ్రాఫ్స్ లకి టిల్ట్ షిఫ్ట్ ఎఫెక్ట్స్ ని అప్లయి చేస్తుంది. సులభంగా ఉపయోగించుకోవడానికి డిజైన్ చేసిన ఈ యాప్ లో కస్టమైజ్ సౌకర్యాలు కూడా అధికమే. అన్ని రకాల ఎడిటింగ్ ఆప్షన్స్ మన చేతిలోనే వుంటాయి. ప్రీసేట్ ఫంక్షన్ ఆప్షన్ తో ఇష్టమైన సెట్టింగ్స్ ని సేవ్ చేసుకుని, తర్వాత ఎప్పుడైనా ఏ వీడియోలకైనా, ఫోటోలకైనా ఫిల్టర్స్ గా అప్లయి చేసుకోవచ్చు.
4) స్లోమో : ఈ యాప్స్ తో స్లో మోషన్, ఫాస్ట్ మోషన్ వీడియోలని చిత్రీకరించ వచ్చు. ఎన్నిసార్లు స్పీడ్ ని అడ్జస్ట్ చేసినా పిక్చర్ క్వాలిటీ తగ్గదు. సింపుల్ గా స్లైడర్ నుపయోగించి కోరుకున్న స్పీడ్ ని సెలెక్ట్ చేసుకుని, కెమెరా రోల్ నుంచి ఒక క్లిప్ ని పికప్ చేసుకుని, లేదా ఓ వీడియోని రికార్డు చేసుకుంటే, అది స్లో లేదా స్పీడ్ మోషన్ కి ప్రాసెస్ చేసుకుంటుంది.
5)మూవీ లుక్స్ హెచ్ డీ : దీనిద్వారా తీసిన వీడియోలో లేదా ఫోటోలో సినిమా ఎఫెక్ట్స్ ఇచ్చి మన కుటుంబ సభ్యులకి మూవీ స్టార్ హంగులని సమకూర్చవచ్చు. టర్మినేటర్, సాల్వేషన్, బోర్న్ ఐడెంటిటీ వంటి హాలీవుడ్ సినిమా ఎఫెక్ట్స్ ఇందులో లభ్యమౌతాయి.
6) ఓల్డ్ వీడియో ప్రో : ప్రస్తుతం తీసిన వీడియో పురాతన వీడియోలా కన్పిచాలంటే ఈ యాప్స్ ని ప్రయోగించ వచ్చు. తీసిన చిత్రాలకి పాత క్లాసిక్ లుక్ ఈ యాప్స్ తో వస్తుంది!
చిత్రీకరణ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే వీలున్న యాప్స్ కి కొదవలేదు. ఇవి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్లికేషన్స్ ని వెంట బెట్టుకుని వస్తున్నాయి. వీటితో పోటీ పడితే తప్ప పది మందిలో విలక్షణతని చాటుకోవడం కష్టం!

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16