టాలీవుడ్

డేరా బాబా గొడవలో రాఖీ సావంత్ ఇరుక్కుంది,5 కోట్లు జరిమానా

Dera-Baba-Controversiesడేరా స్వచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. అత్యాచారం కేసులో ఆయన్ను సీబీఐ దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌ను అరెస్ట్‌ చేసిన అనంతరం హరియాణాలోని పంచకులలో అల్లర్లకు పాల్పడేలా ప్రేరేపించినందుకు హనీప్రీత్‌ను కూడా హరియాణా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం గుర్మీత్ సింగ్..హనీప్రీత్ జీవిత ఆధారంగా బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఇందులో బాలీవుడ్ హాట్ నటి ‘రాఖీ సావంత్’ నటిస్తోంది.

తాజాగా హనీప్రీత్‌ తల్లి ఆశా తనేజా బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌పై దావా వేశారు. తన కుమార్తె గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందన్న నేపథ్యంలో రాఖీకి నోటీసులు పంపినట్లు ఆశా మీడియా ద్వారా వెల్లడించారు.

నెల రోజుల్లో క్షమాపణ చెప్పాలని లేకపోతే రూ.5 కోట్లు జరిమానా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. గుర్మీత్‌, హనీప్రీత్‌ అరెస్టయినప్పుడు రాఖీ సావంత్‌ వీరి గురించి మీడియా ద్వారా మాట్లాడారు. ‘ఎ డైలాగ్ విత్ జేసీ’ అనే ఛాట్ షోలో రాఖీ పాల్గొని సంచలన విషయాలు వెల్లడించింది. గుర్మీత్ ను తాను కలుస్తానంటే హనీ ప్రీత్ ఒప్పుకొనేది కాదని..ఎందుకు తెలియదని పేర్కొన్నారు. ఎక్కడ గుర్మీత్ ను పెళ్లి చేసుకుంటానోనని తనని దూరంగా పెట్టేదని, తనకు మూడేళ్లుగా గుర్మీత్..హనీప్రీత్ తో పరిచయం ఉందని వెల్లడించారు.

గుర్మీత్ తన పుట్టిన రోజు సందర్భంగా తనను డేరా ఆశ్రమానికి ఆహ్వానించారని, కానీ అది హనీ ప్రీత్ కు నచ్చేది కాదని, కానీ ఇలా ఆడవారి జీవితాలతో ఆడుకుంటాడని…మగవారిని నపుంసుకల్ని చేస్తాడని ఊహించలేదని ‘రాఖీ సావంత్’ పేర్కొన్నారు.

మరోపక్క గుర్మీత్‌ జీవితాధారంగా బాలీవుడ్‌లో ఓ బయోపిక్‌ రాబోతోంది. ఇందులో హనీప్రీత్‌ పాత్రలో రాఖీ సావంత్‌ నటిస్తోంది. ఆమె గుర్మీత్..హనీ ప్రీత్ జీవిత ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ‘రాఖీ’ ఎలా నటించనుందో..ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తారో వేచిచూడాలంటోది బాలీవుడ్.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16