టాలీవుడ్

హీరో శ్రీకాంత్ ఇంట్లో సైకో దాడి,పోలీసులు అదుపులో నిందితుడు

srikanthహీరో శ్రీకాంత్ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు. శ్రీకాంత్‌ను కలవాలంటూ ఓ యువకుడు దౌర్జన్యంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించడమే కాక శ్రీకాంత్‌పై దాడికి ప్రయత్నించటం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతా షాక్ కు గురి అయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన బి.వెంకటేశ్‌(29) జూబ్లీహిల్స్‌ రోడ్‌నం. 10లో వ్యాక్స్‌బేకరీ సమీపంలో నివసిస్తున్నాడు. పదేళ్లుగా జూబ్లీహిల్స్‌లోని పలువురు ప్రముఖుల నివాసాల్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. హీరో శ్రీకాంత్‌ అంటే వెంకటేశ్‌కు వల్లమాలిన అభిమానం. మూడేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 76లోని శ్రీకాంత్‌ ఇంట్లో కూడా మూడు నెలల పాటు వంట మనిషిగా పనిచేశాడు. అయితే వెంకటేశ్‌ పనితీరు సరిగా లేకపోవడం.. సైకోలా ప్రవర్తిస్తుండటంతో అతనిని విధుల నుంచి తొలగించారు. అనంతరం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 10లో ఓ రాజకీయ నాయకుని నివాసంలో పనికి కుదిరాడు. అయితే శ్రీకాంత్‌ తరచూ తనకు కలలో వస్తుంటాడని, కలవడానికి ఎన్నిసార్లు వెళ్లినా అనుమతించడం లేదని ఆరోపిస్తూ శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీకాంత్‌ ఇంటి వద్ద హల్‌చల్‌ చేశాడు.

వెంకటేశ్‌ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా వాచ్‌మెన్‌ అడ్డుకోవడంతో అతనిని నెట్టేసి అక్కడే ఉన్న కర్రతో బీఎండబ్ల్యూ కారు(ఏపీ 10ఏఎస్‌ 0789), ఫోర్డ్‌ కారు(ఏపీ 09 సీఎల్‌ 9414) అద్దాలు ధ్వంసం చేశాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోకి చొచ్చుకెళ్లాడు. అడ్డువచ్చిన డ్రైవర్‌ మోహన్‌ను నెట్టేసి శ్రీకాంత్‌ బెడ్‌రూమ్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మేడ మీద నుంచి కిందకు దిగుతున్న శ్రీకాంత్‌.. ఎవరు నువ్వని ప్రశ్నిస్తుండగా మెట్ల మీద నుంచి ఆయనను తోసేశాడు. అయితే శ్రీకాంత్‌ అప్రమత్తంగా ఉండటంతో తృటిలో ప్రమాదం తప్పింది.

శ్రీకాంత్‌ సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు.  అయితే వారిని కూడా తోసేసి మళ్లీ లోనికి వెళ్లేందుకు వెంకటేశ్‌ ప్రయత్నించడం తో పోలీసువారు చాకచక్యం తో  వెంకటేశ్‌ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. తనలోని మరో వ్యక్తే ఇలా చేశాడని నిందితుడు చెబుతున్నట్టు పోలీసులు తెలిపారు. అనేక కట్టుకథలు వినిపించిన వెంకటేశ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll