బాక్స్ ఆఫీస్

‘ఉన్నది ఒకటే జిందగీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Unnadi-Okkate-Zindagiరామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే అవే నిజమయ్యాయి. దర్శక నిర్మాతలు అదే డేట్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాలో రామ్ .. అభిరామ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడని నమ్మే యువకుడు అభిరామ్‌. నలుగురు స్నేహితులతో కలిసి రాక్‌బ్యాండ్‌ను ప్రారంభిస్తాడు. చిన్నప్పటి నుంచి సంతోషంగా సాగుతోన్న అభిరామ్‌ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. వీరిలో ఎవరితో అభిరామ్‌ ప్రేమలో పడ్డాడు? అభిరామ్‌ జిందగీలో స్నేహితులు ఎలాంటి పాత్ర పోషించారు? అనేదే చిత్రం కథ అంటున్నారు దర్శకుడు కిశోర్‌ తిరుమల.

లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్స్ . కృష్ణ చైతన్య నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ ణ పూర్తి చేసుకుని 27న విడుదలకు సిద్ధమౌతోన్నట్లు దర్శకుడు తెలిపారు.

శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌషిక్‌ ఈ చిత్రంలో రామ్‌ స్నేహితులుగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll