టాలీవుడ్

ఏమన్నావాడతారా మీరు..డైరక్ట్ గా స్టేజిపై సుబ్బిరామిరెడ్డిని అడిగిన అలీ

ali1దాదాపు నలభై ఏళ్ల నుంచి సుబ్బిరామిరెడ్డి గారిని చూస్తున్నా…అప్పుడు ఎలా ఉన్నారో..ఇప్పుడు అలాగే ఉన్నారు..ఎప్పుడు అదే గ్లామర్ తో ఉంటారు. ఏమన్నా వాడతారా సార్ మీరు.. అంటూ సుబ్బి రామిరెడ్డిగారిని ప్రశ్నించారు ప్రముఖ కమిడయన్ అలీ. ఈ సంఘటన ఓ ప్రెస్ మీట్ లో జరిగింది. అందరూ హాయిగా నవ్వుకున్నారు. పూర్తి వివరాల్లకి వెళితే..

సీనియర్‌ నటుడు బ్రహ్మానందానికి అరుదైన గౌరవం దక్కబోతోంది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గానూ ‘హాస్య నటబ్రహ్మ’ బిరుదుతో సత్కరించనున్నారు. అలనాటి కాకతీయ సామ్రాజ్య కళావైదుష్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సారిగా ఈ నెల 11న మహబూబ్‌నగర్‌ జిల్లాలో ‘కాకతీయ కళావైభవ మహోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు. పద్మశ్రీ బ్రహ్మానందం 1100లకు పైగా చిత్రాలలో నటించిన సందర్భంగా ఆయన సేవలకు గుర్తింపుగా ‘హాస్య నటబ్రహ్మ’ బిరుదుతో ఘనంగా సత్కరించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో…ali2

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”కాకతీయ లలిత కళాపరిషత్తు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైభవంగా అప్పటి కాకతీయుల ఖ్యాతిని తెలియజేయాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సభాపతి సిరికొండ మధుసూదనాచారి, ఎస్‌.జైపాల్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతుంటే.. జూపల్లి కృష్ణారావు, డా.సి.లక్ష్మారెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా హాజరు కానున్నారు. చలన చిత్ర పరిశ్రమకు చెందిన జయప్రద, డా.రాజశేఖర్‌, జీవిత, బాబూమోహన్‌, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కవిత, కేథరిన్‌ థ్రెసా, హంసానందిని, శ్రద్ధాదాస్‌, పృథ్వీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి తదితరులను కాకతీయ పురస్కారాలతో సత్కరిస్తాం. అలాగే మహబూబ్‌ నగర్‌కు చెందిన సాహిత్య, సంగీత, నృత్య కళాకారులు ప్రొడ. ఎల్లూరి శివారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గొరేటి వెంకన్న, చిక్కా హరీశ్‌, జంగిరెడ్డి, పద్మాలయా ఆచార్య, వంగీశ్వర నీరజ తదితరులను కాకతీయ అవార్డుతో సత్కరిస్తాం” అన్నారు.

శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ – ”బ్రహ్మానందం గొప్ప నటుడు. తెలుగు రాష్ట్రాల్లో మరచిపోలేని నటుడు. కళాకారులకు, కవులకు, నటులకు కుల, మత, ప్రాంతీయ బేదాలుండవు. కని వినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేస్తాం” అన్నారు.

అలీ మాట్లాడుతూ – ”కళాకారులంటే నటరాజుకి చాలా ఇష్టం. ఆ నటరాజు సుబ్బరామిరెడ్డిగారి రూపంలో వచ్చారు. ఎందుకంటే 1100 సినిమాలు పూర్తి చేసుక్ను మా అన్న బ్రహ్మానందంకు బిరుదునిచ్చి సత్కరించడం గొప్ప విషయం. మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 1100 సినిమాలు చేయడం గొప్ప విషయం” అన్నారు.

డా.బ్రహ్మానందం మాట్లాడుతూ ”కళలకు ఎల్లలు లేవు. కళల్లో ఈశ్వరత్వం ఉంటుంది. అలాంటి ఈశ్వరుడ్ని పూజించే సుబ్బరామిరెడ్డిగారు ఈ అవార్డు వేడుకలు నిర్వహిస్తుండటం గొప్ప విషయం. ఆ దేవుడి దయ వల్ల ఎన్నో అవార్డులను స్వీకరించినప్పటికీ.. రేపు నేను తీసుకోబోయే అవార్డు విశిష్టమైందని భావిస్తున్నాను. అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను” అన్నారు.

ఇదే కార్యక్రమంలో సినీ ప్రముఖులు జయప్రద, రాజశేఖర్‌, జీవిత, బాబుమోహన్‌, పరుచూరి గోపాలకృష్ణ, అలీ, కవిత, కేథరిన్‌, హింసానందిని, శ్రద్ధాదాస్‌, పృథ్వీ, రఘుబాబు, శ్రీనివాసరెడ్డిలను ‘కాకతీయ పురస్కారాల’తో సత్కరించనున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2