టాలీవుడ్

‘రుద్రమదేవి’ నిర్మించినందుకు నన్ను క్షమించండి

Gunasekhar-at-Rudhramadevi-Pressmeet‘మా సిన్మాకి పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదని ప్రశ్నించడమే నేను చేసిన తప్పా?’ అంటున్నారు ‘రుద్రమదేవి’ దర్శక–నిర్మాత గుణశేఖర్‌. . సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.‘ఇప్పుడు ప్రకటించిన 2014, 15, 16 సంవత్సరాల అవార్డుల విషయంలో ఎవరు ప్రశ్నించినా వాళ్లని మూడేళ్లపాటూ అవార్డులకి అనర్హులుగా ప్రకటిస్తారట..! అసలు మనం ఏ దేశంలో ఉన్నాం..? స్వతంత్ర భారతంలోనేనా? అంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు.

‘‘మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి’ మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎందుకు ఎంపిక కాలేకపోయింది? కనీసం జ్యూరీ గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయింది. మరచి పోయిన తెలుగు జాతి చరిత్రని వీడెవడో వెతికి, సినిమా తీసి గుర్తు చేశాడు. మళ్లీ ఇప్పుడు అవార్డులు ఇచ్చి గుర్తు చేయడం ఎందుకు అనుకున్నారా? ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారా? అదే అయితే… ‘రుద్రమదేవి’ లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి’’ అని గుణశేఖర్‌ పేర్కొన్నారు. ఆయన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll