టాలీవుడ్

అన్నగారి ప్రసక్తి తెచ్చి కౌంటర్ ఇచ్చిన గుణశేఖర్

ntr-gunashakerఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అవార్డుల ప్రకటించిన తీరును దర్శకుడు గుణశేఖర్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ క్లారిటీ ఇవ్వాలని కోరారు. అలాగే తాను తీసిన చారిత్రక చిత్రం రుద్రమదేవికి అన్యాయం చేశారంటూ బహిరంగ లేఖతో డైరెక్టర్ గుణశేఖర్ అటాక్ చేయడంతోపాటు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆవేదన బయటపెట్టాడు. అయితే ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ అబిమానులు సోషల్ మీడియాలో గుణశేఖర్ కు కౌంటర్స్ ఇచ్చారు.

గుణశేఖ‌ర్‌ను టార్గెట్ చేస్తూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ మధ్య సీనియర్ డైరెక్టర్ మల్లెమాల ఎం.ఎస్.రెడ్డి ఇది నా కథ పేరుతో తన జీవిత చరిత్ర రాశారు. ఇందులో గుణశేఖర్ తనకు ఎలా పరిచయమైంది.. ఆ పరిచయం ఎలా పెరిగింది రాసుకొచ్చారు. ఆ పేజీలను పోస్ట్ లుగా పెడుతున్నారు. అందులో కెరీర్ లో పైకెదిగాక గుణశేఖర్ తన పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించాడని డైరెక్ట్ గానే రాశారు.

గుణ‌శేఖ‌ర్ త‌న చేత చాలా ఎక్కువ డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టించాడ‌ని, ఆ సినిమా ఆర్థికంగా విజ‌య‌వంతం కాక‌పోవ‌డంతో మ‌రో సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడ‌ని తెలిపారు. అయితే చిరంజీవితో `చూడాల‌ని ఉంది` చేసే అవ‌కాశం రావ‌డంతో త‌న‌ను విస్మ‌రించాడ‌ని విమర్శించారు.

ఎన్నిసార్లు అడిగినా త‌న‌ను ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న రాశారు. దీంతో పుస్త‌కంలోని ఆ వ్యాఖ్య‌ల‌ను అండ‌ర్‌లైన్ చేస్తూ కొంత మంది త‌మ‌ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌ల గురించి గుణశేఖ‌ర్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. `ఈ పుస్త‌కంలో నింద‌ల్ని కొంద‌రు త‌మ్ముళ్లు స‌మ‌ర్థించ‌వ‌చ్చేమో కానీ, ఇదే పుస్త‌కంలో అన్న‌గారిపై వ‌చ్చిన నింద‌ల్ని నేను ఏమాత్రం స‌మ‌ర్థించ‌ను` అని ట్వీట్ చేశారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll