టాలీవుడ్

గోపిచంద్ వార్నింగ్…‘ఆక్సిజన్‌’ ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌

గోపీచంద్‌ నటించిన మరో సినిమా ‘ఆక్సిజన్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొన్న ఈ చిత్రానికి ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకుడు. గోపీచంద్‌ కెరీర్‌లోనే స్పెషల్‌ మూవీగా నిలిచేలా ఎంతో కేర్‌ తీసుకొని హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాని రూపొందించినట్లు ఆయన తెలిపారు. . శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌ బేనరుపై ఎస్‌. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది.

‘ప్రతీ వూరిలో నీలాంటోడు ఒకడు ఉంటాడని తెలుసు.. కానీ నాలాంటోడు ఒకడు వస్తాడని నీకు తెలియదు’ అంటూ గోపీచంద్‌ వార్నింగ్‌ ఇచ్చే సన్నివేశం అభిమానులను అలరిస్తోంది. సినిమా గోపీచంద్‌ శైలిలో పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

గోపీచంద్‌ మాట్లాడుతూ.. ‘‘కుటుంబ వినోదంతో పాటు ఒక మంచి సందేశం కూడా ఉన్న చిత్రం ‘ఆక్సిజన్‌’. నా శైలి యాక్షన్‌తో పాటు, ప్రేమకథ కూడా ఉంది. కొన్నేళ్లుగా మన సమాజంలో జరుగుతున్న, అందరికీ తెలిసిన ఓ విషయాన్నే ఇంకాస్త బలంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. అది ప్రేక్షకులకు చేరవవుతుందనే నమ్మకం ఉంది. కొన్ని కథల్లో వాణిజ్యాంశాలతో పాటు, సందేశానికీ చోటుంటుంది. ఆ కోవకి చెందిందే మా ‘ఆక్సిజన్‌’. ఒక మంచి సినిమా చేశామనే తృప్తి ఉంది’’ అని అన్నారు. శ్రీ సాయి రామ్‌ క్రియేషన్స్‌ పతాకం ఎస్‌. ఐశ్వర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూర్చారు.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll