టాలీవుడ్

గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ..అదే రూటులోనే

Gopichand-Stills-At-Aaradugula-Bullet-Movie-Press-Meet-10గోపీచంద్ హీరోగా చక్రి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ కి ఇది 25వ సినిమా కావడం విశేషం. కె.కె.రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంతవరకూ గోపీచంద్ చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

అందువల్లనే 25 వ సినిమాగా దీనిని ఓకే చేశారని అంటున్నారు. మెహ్రీన్ టీచర్ గా కనిపిస్తుందట .. ఈ పాత్రలో ఆమె చాలా కొత్తగా కనిపిస్తుందని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకి ‘పంతం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన్నట్టు తెలుస్తోంది. చివరిలో ‘సున్నా’ వచ్చేలా టైటిల్ ను సెట్ చేయడం గోపీచంద్ కి సెంటిమెంట్ కావంటతో ఆ టైటిల్ వైపు మొగ్గు చూపినట్లు చెప్తున్నారు. ‘యజ్ఞం’ .. ‘లక్ష్యం’ .. ‘లౌక్యం’ లానే ఈ సినిమాకి ‘పంతం’ టైటిల్ ను ఖరారు చేయనున్నారని అంటున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16