టాలీవుడ్

గోపీచంద్ మళ్లీ హ్యాండ్ ఇస్తాడా లేక ఓకే అంటాడా?

Gopichand-Stills-At-Aaradugula-Bullet-Movie-Press-Meet-10గోపిచంద్ కు 2017 కలిసి రాలేదనే చెప్పాలి. ఏ సినిమా కూడా హిట్ అనిపించుకోలేదు. ఏడాది చివర్లో వచ్చిన ఆక్సిజన్ చిత్రం సైతం డిజాస్టర్ అనిపించుకుంది. దాంతో ఆయన వచ్చే సంవత్సరం చేయబోయే చిత్రాలు చాలా జాగ్రత్తగా ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా దర్శకుడు వీరూపోట్లతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఈ మేరకు కొన్ని సిట్టింగ్స్ జరిగాయని, స్టోరీ లైన్ ఓకే అయ్యిందని చెప్తున్నారు. పూర్తి స్క్రిప్టుతో కలవమని వీరు పోట్లకు చెప్పటంతో ఆయన ఆ పనిలో ఉన్నారని సమాచారం. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆ చిత్రం ఉండనుందని సమాచారం.

‘బిందాస్’, ‘రగడ’ , ‘దూసుకెళ్తా’ చిత్రాలను డైరెక్ట్ చేసిన వీరూ పోట్లకి ఎందుకనో సరైన బ్రేక్ రాలేదు. విషయమున్న మంచి రచయిత గా ప్రూవ్ చేసుకున్న ఆయన దర్శకుడుగానూ తనేంటో నిరూపించుకున్నరు. అయితే కాంబినేషన్స్, హీరోలు సెట్ కాక అలా ఖాళీగా ఉండిపోతున్నారు. ఆ మధ్యన సునీల్ తో చేసిన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా తరువాత తిరిగి ఏ ప్రాజెక్టూ ప్రారంభించలేదు. అయితే ఈ దర్శకుడు తన తదుపరి సినిమా గోపీచంద్ తో వుంటుందని కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

అప్పట్లో గోపీచంద్‌తో సినిమా చేస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. అయితే… ‘ఆ వార్తలేం నిజం కాదు’ అని ట్విట్టర్ సాక్షిగా కొట్టిపారేశాడు వీరూపోట్ల‌. నిజానికి ర‌గ‌డ త‌ర‌వాత వీరూ – గోపీచంద్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రావాల్సింది. కొంత‌కాలం గోపీచంద్ వెనుక క‌థ‌ప‌ట్టుకొని తిరిగాడు వీరూ. కానీ కుద‌ర్లేదు.

వాస్తవానికి గోపీ నుంచి పిలుపు వ‌చ్చిన మాటా నిజ‌మే. కాక‌పోతే… క‌థ‌పై గోపీచంద్ పూర్తి సంతృప్తి వెలుబుచ్చక‌పోవ‌డంతో ఆయ‌నా ‘నో’ అనేశాడు. మ‌రి వీరూపోట్లకు ఈ సారైనా గోపీచంద్ …ఆఫర్ ఇస్తాడో లేదో చూడాలి?కాకపోతే గోపీచంద్ సైతం పరిస్దితి బాగోలేదు కాబట్టి ఓకే చేసి వెంటనే పట్టాలు ఎక్కించే అవకాసం ఉందంటున్నారు.

ఇదేకాక వీరుపోట్ల విక్టరీ వెంకటేష్, రవితేజల కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ డైరెక్ట్ చెయ్యాల్సివుండగా కొన్ని కారణాల వలన అది ఆగిపోయినట్టు తెలుస్తుంది. తాజాగా సక్సెఫుల్ కాంబినేషన్ అయిన వీరు పోట్ల – మనోజ్ కాంబినేషన్లో బిందాస్ 2 అనే సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్నారు. అయితే అదీ ముందుకు వెళ్లలేదు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16