గాసిప్స్

ఘాజీ డైరెక్టర్ నెక్స్ట్ వరణ్ తేజ తో కాదా? కొత్త ట్విస్ట్

varun-sankalp-filmతొలి చిత్రంనే భాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ని సాధించటంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. ఇంతటి విజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో సంకల్ప్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం..ఇప్పుడు సంకల్ప్ రెడ్డి రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు ఓకే చేసి ఆ స్క్రిప్టులు రెడీ చేసే పనిలో ఉన్నారట. ఈ విషయాన్ని సంకల్ప్ మీడియాతో మాట్లాడుతూ రివీల్ చేసారు. సంకల్ప్ మాట్లాడుతూ…అవును నేను రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు సైన్ చేసిన మాట నిజమే. ఒకటి రోనీ స్క్రూవాలా, రెండోది విపుల్ షా. వీరిద్దరూ సంకల్ప్ తో భారీ ప్రాజెక్టులు చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాల్లో హీరోగా చేసేదెవరనేది మాత్రం తెలియరాలేదు.

సైన్స్ ఫిక్షన్ కథతో మొదటగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకు ఈ ఇద్దరు నిర్మాతలలో ఎవరన్నది ఇంకా చెప్పటం లేదు. నేను ఇప్పుడే సినిమాలకు సైన్ చేసారు. ఈ సమయంలో ప్రాజెక్టుల గురించి ఎక్కువ మాట్లాడటం సరికాదు అంటున్నారు సంకల్ప్. ఈ రెండు సినిమాలు వచ్చే సంవత్సరం సెట్స్ మీదకు వెళ్తాయి. మరి ఈ లోగా వరణ్ తేజ ఏదన్నా సినిమా ప్లాన్ చేసేస్తాడంటారా..

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll