టాలీవుడ్

వరుణ్ తేజ ‘తొలిప్రేమ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

రీసెంట్ గా ఫిదా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా హీరో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాడ్జియస్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ టైటిల్ కు కి సంబంధించి గత కొన్ని రోజులుగా పలు వార్తలు హల్ చల్ చేశాయి.

పవన్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచిన తొలి ప్రేమ టైటిల్ ని వరుణ్ తేజ్ మూవీకి వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పవన్ అభిమానులు కొందరు దీనిపై వాదానికి దిగారు కూడా. కట్ చేస్తే తాజాగా వరుణ్ తేజ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీన్ని వరుణ్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.varun tej toli prema

ఈ సినిమాకు ‘తొలిప్రేమ’ టైటిల్‌ను ఖరారు చేశారు. తొలి ప్రచార చిత్రంలో వరుణ్‌తేజ్‌ కొత్త లుక్‌లో కనిపించారు. ఓ స్టేషన్‌లో కూర్చొని మొబైల్‌ చూసుకుంటున్నారు. ‘ప్రేమ ప్రయాణం’ అని పోస్టర్‌పై రాసి ఉంది.

ఫిబ్రవరి 9, 2018న తొలిప్రేమ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పోస్టర్ లో వరుణ్ లుక్ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ మూవీని వరుణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. జార్జి సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా, థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రియదర్శిని పులికొండ్ల, సుహాసిని మణిరత్నం ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా ‘తొలిప్రేమ’ టైటిల్‌తో1998లో సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll