టాలీవుడ్

అల్లు శిరీష్ “ఒక్క క్షణం” ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదిగో

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ఒక్క క్షణం.

ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం డిసెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు

ఈ చిత్ర బిజినెస్ భారీస్థాయిలో జరుగుతోంది. తాజాగా ఒక్క క్షణం ఆంధ్రా హక్కుల్ని దాదాపు 6 కోట్లకు కాశీ విశ్వనాథం దక్కించుకున్నారు. ఈయన గతంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన రవితేజ నటించిన కృష్ణ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలు నిర్మించడంతో పాటు పబ్లిక్ పల్స్ తెలిసిన నిర్మాత కావడంతో ఒక్క క్షణం ఆంధ్రా హక్కుల్ని దక్కించుకున్నారు. హీరో, దర్శకుడు, నిర్మాతల మీదున్న నమ్మకంతో పాటు… సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే టాక్ రావడంతో ఆంధ్రా హక్కుల్ని భారీగా చెల్లించి దక్కించుకున్నారు.

అల్లు శిరీష్ , సుర‌భి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, సీర‌త్ క‌పూర్ లు కొత్త పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటారు. అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, శ్యామ్ కె నాయిడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. సతీష్ వేగేశ్న, రాజేష్ దండ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు – అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీర‌త్ క‌పూర్‌, కాశి విశ్వ‌నాథ్, రోహిణి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌వీణ్‌, స‌త్య‌, సుద‌ర్శ‌న్‌, వైవా హ‌ర్ష‌, ప్ర‌భాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి ముర‌ళి, ర‌వి వ‌ర్మ‌, శ్రీసుధ‌, చిత్రం భాషా, భిందు, ప్ర‌ణ‌వ్‌, బద్రం త‌దిత‌రులు న‌టించ‌గా…
కో ప్రొడ్యూసర్స్ – సతీష్ వేగేశ్న, రాజేష్ దండ
సంగీతం – మణిశర్మ
డిఓపి – శ్యామ్ కె నాయిడు
డైలాగ్స్ – అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్ జి
పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ – నాగేంద్ర ప్రసాద్
క్రియేటివ్ హెడ్ – సంపత్ కుమార్
కో డైరెక్టర్ అండ్ అడిష‌న‌ల్ డైలాగ్స్‌ – విజయ్ కామిశెట్టి
బ్యానర్ – లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత – చక్రి చిగురు పాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – విఐ ఆనంద్

Comments

comments

Teaser

Trailer

Teaser 2

Coming Soon

ఆక్సిజన్ NOV 30
జవాన్ DEC 1
MCA DEC 21
హలో DEC 22
చలో DEC 29

Now Showing

బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17
లండన్ బాబులు 17 NOV 17
గృహం NOV 10
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll