టాలీవుడ్

అఖిల్ ‘హలో!’ ఫస్ట్ లుక్ లో ఈ స్పెషాలిటీ గమనించారా?

రకరకాల క్విజ్ లు పెట్టి ఫైనల్ గా …అఖిల్‌ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రానికి ‘హలో!’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్ గా పరిచయమవుతోంది.

తన ‘నిర్ణయం’ చిత్రంలోని ‘హలో గురూ ప్రేమకోసమేరోయ్‌ జీవితం’ పాటలో ని తొలి రెండు అక్షరాలైన ‘హలో!’యే సినిమా టైటిల్‌ అంటూ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా నాగార్జున ప్రకటించారు. ఇందులో అఖిల్‌ ఓ ఎత్తైన భవనం అంచుల చివరిన చేతులపై నిలబడి ఉన్నారు.

పలువురు హీరో హీరోయిన్లతో ‘హలో!’ అని చెప్పించిన వీడియో క్లిప్పును పోస్ట్‌ చేశారు. మొదట మూడు అంకెలు లెక్కపెట్టి, ‘హలో!’ అని ఎన్టీఆర్‌ అనగా, తర్వాత వరుసగా కాజల్‌ అగర్వాల్‌, ప్రభాస్‌, శ్రుతి హాసన్‌, నాగచైతన్య, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సమంత, సూర్య, నాని, వెంకటేశ్‌, రాజమౌళి, రకుల్‌ప్రీత్‌, రానా ‘హలో!’ అని చెప్పారు.

తర్వాత నాగార్జున ‘‘ఆర్‌ యు రెడీ.. నాన్నా! మీరే చెప్పండి’’ అనగానే ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ‘హలో.. హలో..’ అంటూ పాట పాడటాన్ని చూపించారు. గమనించాల్సిన విషయమేమంటే ‘హలో!’ అనే మాటతో హీరోయిన్‌ కల్యాణికి కూడా సంబంధం ఉండటం. ‘నిర్ణయం’ను రూపొందించింది ఆమె తండ్రి ప్రియదర్శనే! ‘హలో!’ను డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll