టాలీవుడ్

రెండు ‘వి’ లు కలిసాయి విక్టరీనే : వీయన్ ఆదిత్య దర్శకుడుగా, వీర శంకర్ నిర్మాతగా

aala nenu iela nuvvuఇద్దరూ పెద్ద హీరోలతో చేసిన దర్శకులే, క్రియేటివిటి మారు పేరైన దర్శకులే…వారిద్దరూ కలిసి ఓ సినిమాకి పని చేస్తే ఆ ప్రొడెక్టు ఏ స్దాయిలో ఉంటుంది. ఆ అద్బుతమే టాలీవుడ్ లో జరగబోతోంది. అదీ హోమ్‌ థియేటర్‌ ఓనర్స్‌ కోసం ప్రత్యేకంగా నిర్మితమవుతున్నవి తెలుగు చిత్రాం కావడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే… పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన వీరశంకర్ చాలా రోజుల తర్వాత ఓ భిన్నమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్రానికి ‘మనసంతా నువ్వే’ సినిమా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించడం విశేషం. “అలా నేను.. ఇలా నువ్వు” టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే తొలి హోం థియేటర్ చిత్రంగా పేర్కొన్నారు నిర్మాత.

యునిక్‌ కాన్సెప్ట్‌ థియేటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో భాగంగా 2018 ఆగస్ట్‌ 17న హెచ్‌.టి.ఓ. క్లబ్‌ (హోమ్‌ థియేటర్‌ ఓనర్స్‌ క్లబ్‌)ను స్థాపించారు. వివిధ దేశాలలో ఉన్న తెలుగువారిలో హోమ్‌ థియేటర్లున్న వారికి ఒరిజినల్‌ కంటెంట్‌ అందించడమే దీని ప్రధాన లక్ష్యం.ala enu iela nuvvu

వీరశంకర్ మాట్లాడుతూ… హోమ్‌ థియేటర్ల ఓనర్ల కోసం మరెక్కడా దొరకని, ఎక్కడా ఉపయోగించని, వారి కోసం మాత్రమే వినోదాన్ని అందించే ప్రయత్నం తాము చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే దాదాపు కోటీ డెబ్భై అయిదు లక్షల రూపాయల బడ్జెట్‌ తో ‘అలా నేను… ఇలా నువ్వు’ అనే సినిమాను ఇప్పుడు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య నిర్దేశకత్వం వహించే ఈ చిత్రానికి వీరశంకర్‌ కథ, కథనం అందిస్తున్నారు. రాజ్‌ కందుకూరి సమర్పణలో వీరశంకర్‌ సిల్వర్‌ స్ర్కీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రం నిర్మాణం కానుంది.

దర్శక, నిర్మాత మారుతి ఇష్టపడి రాసిన టైటిల్‌ లోగోను, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల విశాఖపట్నంలో ఆవిష్కరించారు. శనివారం నాడు ఈ సినిమాను పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాయి రోనక్‌, అమృతా అయ్యర్‌ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం పోలవరంలో హీరో హీరోయిన్ల ఇంటి సెట్‌ను భారీ వ్యయంతో నిర్మిస్తుండడం విశేషం. ఈ వేసవిలో చిత్రం షూటింగ్‌ పూర్తి చేసి, రానున్న జూలై నాలుగున విడుదల చేయాలన్నది మా ప్రయత్నం అని వీరశంకర్‌ చెప్పారు.

ఈ విధంగా మొదటి ఏడాది నాలుగు, రెండో ఏడాది తొమ్మిది, మూడో ఏడాది పన్నెండు చిత్రాలను రూపొందించాలన్నది వీరశంకర్‌ టీమ్ పెట్టుకున్న బృహత్తర ప్రణాళిక. ‘‘ఇప్పటికే పలువురు ప్రముఖ దర్శకులతో పాటు యంగ్‌ డైరెక్టర్స్‌ సైతం మాకు సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు సీనియర్‌ నిర్మాతలూ కేవలం హెచ్‌.టి.ఓ. క్లబ్‌ కోసం సినిమాలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. అలా దీపావళికి రెండో చిత్రాన్ని, వచ్చే ఏడాది శివరాత్రికి మూడో సినిమాను, సమ్మర్‌లో నాలుగో చిత్రాన్ని విడుదల చేయాలన్నది మా ప్రయత్నంు అని ఆయన చెప్పారు. ఈ సినిమాల స్ర్కిప్ట్‌లను పరిశీలించేందుకు నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. సినీ ప్రముఖులు సత్యానంద్‌, అనూరాధా ఉమర్జీ, దేవీప్రసాద్‌, మదన్‌, రఘునాథ్‌ సముద్రాల, హుస్సేన్‌ షా కిరణ్‌ల నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

tr> tr>
ఆచారి అమెరికా యాత్ర MAR
కిరాక్ పార్టీ MAR

Now Showing

tr> tr>
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10