బాలీవుడ్

నగ్న ఫోటోను పోస్ట్ చేసినందుకే కేసు

rishi-kapoorట్విటర్‌లో రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ విమర్శలపాలయ్యే బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రిషికపూర్‌ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఈ తరహాలోనే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రిషి కపూర్ ఓ పిల్లవాడి న్యూడ్ ఫోటోను పోస్ట్ చేసి చిక్కుల్లో పడటం జరిగింది. ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న ఈయన ఈసారి తనపై కేసు నమోదయ్యే పరిస్థితిని కూడా తెచ్చుకున్నారు. ఆ స్టోరీలోకి వెళితే, తాజాగా రిషి కపూర్ తన సోషల్ మీడియా ఖాతాలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని నగ్నంగా ఉన్న ఓ పిల్లవాడి ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో ముంబైకి చెందిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ జనలర్ సెక్రటరీ, అడ్వకేట్ ఆదిల్ ఖత్రీ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓ చిన్నారి అసభ్య ఫొటోను ట్విటర్‌లో పెట్టినందుకు ఆయనపై ముంబయిలోని సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం(పోస్కో) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ‘జైహో’ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అఫ్రోజ్‌ మాలిక్‌ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

రిషికపూర్ పోస్టుపై ఇప్పుడు ముంబై పోలీస్ కమిషనర్, ముంబై సైబర్ సెల్, మహిళా శిశు సంక్షేమ శాఖలకు కూడా ఫిర్యాదును అందజేశానని తెలిపారు. ఇదే సమయంలో రిషి కపూర్ ఒక చిన్నారి నగ్న, ఫోర్న్ గ్రాఫిక్ ఇమేజ్ ను షేర్ చేశారని, ఆయన సోషల్ మీడియా ఖాతాకు అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న నేపథ్యంలో వారంతా ఈ ఫోటోను షేర్ చేసుకున్నారని, అందుకే ఈ ఘటనకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదిల్ ఖత్రీ కోరారు. ఈ నేపథ్యంలో తన పోస్ట్ వివాదంగా మారడంతో రిషి కపూర్ ఆ ఫోటోను తన ఖాతా నుంచి తొలగించారు.

‘రిషికపూర్‌కు ట్విటర్‌లో 2.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంటే ఆ అసభ్యకర చిత్రాన్ని అంతమంది చూశారు. పైగా దానికి 66 రీట్వీట్‌లు, 476 లైక్స్‌ వచ్చాయి’ అని మాలిక్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రకు చెందిన జైహో స్వచ్ఛంద సంస్థ ఆ రాష్ట్రంలో మహిళల, పిల్లల అభివృద్ధి కోసం పాటుపడుతోంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll