టాలీవుడ్

ఫ్యాన్స్ గొడవ ‘స్పైడర్’ ధియేటర్‌ పైదాడి, భారీ నష్టం

Mahesh-Babu-Spyder-Movie-Stills-15మహేష్ ఫ్యాన్స్ అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో వ్యవహించిన గుంటూరు జిల్లా వినుకొండలోని ఓ థియేటర్ యాజమాన్యం భారీ నష్టాన్ని చవిచూసింది. థియేటర్ తెరని దగ్ధం చేసే స్థాయిలో అభిమానుల ఆగ్రహానికి గురయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే…నిన్న భారీ ఎత్తున రిలీజైన మహేష్ చిత్రం ‘స్పైడర్’ మూవీ బెనిఫిట్ షో కోసం గుంటూరు జిల్లా వినుకొండకి చెందిన ఓ థియేటర్‌లో ఒక్కో టికెట్‌కి రూ.500 పెట్టి కొనుగోలు చేశారు మహేష్ అభిమానులు. ఈ షో తెల్లవారుజామున 6 గంటలకు పడాల్సి వుంది. కానీ టికెట్స్ అన్నీ అమ్మేసిన తర్వాత 6 గంటలకు కాదు 10 గంటలకు షో అని థియేటర్ యాజమాన్యం తెలపడంతో మహేష్ అభిమానులు రగిలిపోయారు.

ఎంతో ఆశలు పెట్టుకుని ఉదయమే సినిమా చూద్దామని వస్తే ఇలా చేస్తారా అని మండిపడ్డారు. అందరికంటే ముందు సినిమా చూడాలని రూ.500 పెట్టి టికెట్ కొంటే, రెగ్యులర్ షో టైమ్‌కి సినిమా అంటూ మమ్మల్ని మోసం చేస్తారా అంటూ అభిమానులు ఒక్కసారిగా థియేటర్‌పై దాడి చెయ్యడంతో, థియేటర్ అద్దాలు, సీట్లు, తెర అన్ని దగ్ధం అయ్యాయి.

థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు వచ్చే టైంకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా బెనిఫిట్ షో‌కి పర్మిషన్ లేకుండా మీరు టికెట్స్ ఎలా అమ్మారంటూ పోలీసుకు కూడా థియేటర్ యాజమాన్యంపై యాక్షన్ తీసుకుంటామని చెప్పి అభిమానులకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll