టాలీవుడ్

శ్రీదేవి రూ.100 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఎవరికి వెళ్తుంది?

sridevi-7591అతిలోక సుందరి ఇక తిరిగిరాని లోకాలకు మరలిపోయింది. నాలుగు రోజుల క్రితం హఠాన్మరణంతో అభిమాన లోకాన్ని హతాశుల్ని చేసిన శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు శ్రీదేవి పేరిట వంద కోట్ల మేర లైఫ్ ఇన్యూరెన్స్ ఉందని వస్తున్న వార్తలపై అందరి దృష్టీ పడింది. ఇదే విషయంపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ ని పోలీసులు సైతం విచారించినట్లుగా మీడియా ప్రచారం చేసింది. అంతేకాదు ఆమె తన కుటుంబానికి ప్రయోజనకరమైన భీమాను తిరిగి పొందడానికి ఆత్మహత్యకు ప్రయత్నించింది అని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది . ఏది ..నిజం .ఏది అబద్దం అని తెలిసే లోగా అంతా ముగిసిపోయింది.

వాస్తవంగా.. ఆర్థికంగా కూడా ఇన్నాళ్లూ శ్రీ‌దేవి పుణ్య‌మా అని బోనీ క‌పూర్ కూడా హాయిగానే ఉన్నాడు. అయితే చ‌నిపోయే ముందు శ్రీదేవి కుటుంబం కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌నే వార్త‌లున్నాయి. మ‌రి ఇప్పుడు శ్రీ‌దేవి లేని స‌మ‌యంలో వాళ్ల కుటుంబం ఎలా మార‌బోతుందో..? ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి రాబోతున్నాయి వంటి విషయాలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి.

ఇక ..

సినీనటి శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబయి విల్లే పార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీదేవి(54) అంత్యక్రియలు చేసారు. భర్త బోనీకపూర్‌ చితికి నిప్పంటించారు. ఆ సమయంలో ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలు తండ్రి పక్కనే ఉన్నారు. శ్రీదేవి అంతిమయాత్రకు తారాలోకం, అభిమానులు భారీగా తరలివచ్చారు.మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. దశాబ్దాలపాటు వెండితెరను రాణిలా ఏలిన శ్రీదేవి ఇక లేదన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అంతకుముందు సెలబ్రేషన్స్‌ క్లబ్‌ నుంచి తెల్లని పూలతో అలంకరించిన వాహనంపై శ్రీదేవి పార్థివదేహాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఆమెను కడసారి చూసేందుకు దారిపొడగునా అభిమానులు బారులుతీరారు. విలేపార్లే శ్మశానవాటికకు కుటుంబీకులు, సన్నిహితులు, పలువురు సినీతారలు మాత్రమే హాజరయ్యారు.

శ్రీదేవికి చివరి వీడ్కోలు పలికేందుకు తారాలోకం దిగివచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ సినీరంగాలకు చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ఖాన్, చిరంజీవి, రజనీకాంత్, కమల్‌హాసన్, నాగార్జున, వెంకటేశ్, సంజయ్‌ కపూర్, హేమామాలిని, రేఖ, జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్, నగ్మా, సారికా, దీపికా పదుకొనే, రాకేశ్‌ రోషన్, సంజయ్‌ఖాన్, సురేశ్‌ ఒబెరాయ్, వివేక్‌ ఒబెరాయ్, షబానా ఆజ్మీ, జావేద్‌ అఖ్తర్, అనుపమ్‌ ఖేర్, సుస్మితా సేన్, సోనంకపూర్, కాజోల్, అజయ్‌ దేవగన్, టబూ, జయప్రద, సంజయ్‌ఖాన్, అక్షయ్‌ ఖన్నాతో పాటు పలు పార్టీల ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

Comments

comments

Recent

Latest

Song

Coming Soon

tr> tr>
ఆచారి అమెరికా యాత్ర MAR
కిరాక్ పార్టీ MAR

Now Showing

tr> tr>
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10