టాలీవుడ్

వేడుకుంటున్నా, నా సినిమాను చంపేయకండి, స్టార్ హీరో రిక్వెస్ట్

మలయాళంలోని స్టార్ హీరోలలో ఒకరు దుల్కర్ సల్మాన్. మలయాళంతో పాటు తమిళంలోను ఆయనకి ఎంతో క్రేజ్ వుంది. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఆయన తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రం ‘సోలో’ తమిళ .. మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. అయితే తమిళ చిత్రాలపై అదనంగా పది శాతం పన్ను విధించడంతో తమిళ సినిమాలు విడుదల కానివ్వమని నడిగర్‌ సంఘం నిరసన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్ల నుంచి సినిమాను తొలగించేశారు. దీనిపై దుల్కర్‌ సల్మాన్‌ ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. తన సినిమాను చంపేయకండి అంటూ ఎమోషనల్ గా పోస్ట్‌ పెట్టారు.

‘‘సోలో’ సినిమాని చంపేయకండి. మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. సోలో సినిమాను చూశాను. అనుకున్నదానికంటే సినిమా చాలా బాగావచ్చింది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించాను. కానీ భాష పరంగా, స్క్రీన్‌ టైం పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సినిమాల్లో నటించాలని ప్రతి నటుడు కలలు కంటాడు.’

‘నేనేదన్నా సినిమా చేస్తున్నప్పుడు ప్రాణం పెట్టి చేస్తాను. తక్కువ బడ్జెట్‌తో ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు ఎంతో కష్టపడి చేస్తాం. ఇలాంటి సినిమాల్లోని సన్నివేశాలను రీషూట్‌ చేయడానికైనానే నేను సిద్ధమే. చాలా మంది సోలో.. చార్లీ, బెంగళూరు డేస్‌ లాంటి చిత్రం కాదని అలాంటప్పుడు ఈ సినిమాకి ఎందుకు ఒప్పుకున్నావని అడుగుతున్నారు’

‘నాకు విభిన్న కథాంశాలతో కూడుకున్న సినిమాలు చేయడమంటే ఎంతో సరదా. సినిమా రంగంలో చాలా మంది వాడే పదం ‘విభిన్నం’. చాలా మంది ఈ పదాన్ని ఎందుకు తక్కువ చేసి తప్పుగా అర్థంచేసుకుంటారు? అదీకాకుండా సినిమాలో ‘రుద్ర’ పాత్ర వివాదాస్పదంగా ఉందని దర్శకుడికి తెలియకుండానే స్టోరీ మార్చేశారు. ఆ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు నాజర్‌, సుహాసిని గారికి కూడా ఇష్టమే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆ పాత్రను తెరకెక్కించారు’

‘నా కెరీర్‌లో నేను చేసిన బెస్ట్‌ పాత్ర అది. సింగిల్‌ షాట్‌తో దాన్ని తెరకెక్కించారు. ఇలాంటి పాత్రలను చూసి ఎంజాయ్‌ చేయకుండా తప్పుబట్టడం సహించలేకపోయాను. సినిమా అర్థం కానంత మాత్రాన దాన్ని తక్కువ చేసి చూస్తే అది మా నమ్మకాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మీ అందరినీ ఒక్కటే వేడుకుంటున్నాను. సోలో సినిమాను చంపేయకండి. మనసు పెట్టి సినిమా చూస్తే అందులో ఉన్న అంతరార్థం మీకు అర్థం అవుతుంది.’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు దుల్కర్‌.

ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ డిఫరెంట్ షేడ్స్ లో .. డిఫరెంట్ లుక్స్ తో అదరగొట్టేశాడని అంటున్నారు. ఆయన విలక్షణమైన నటన అందరినీ ఆకట్టుకుని తీరుతుందని చెబుతున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో ఆయన సరసన హీరోయిన్స్ గా నేహాశర్మ .. ధన్సిక .. శ్రుతి హరిహరన్ .. ఆర్తి వెంకటేశ్ నటించారు. బలమైన కథా కథనాలతో దర్శకుడు బిజోయ్ నంబియార్ ప్రేక్షకులను కట్టిపడేశారని చెప్పుకుంటున్నారు. దుల్కర్ ఖాతాలో మరో హిట్ చేరిపోయినట్టేనని ఆయన అభిమానులు అంటున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll