టాలీవుడ్

‘నాకు అంత ధైర్యం లేదు, ఉద్దేశం అసలే లేదు’: ఎన్టీఆర్

Jr-NTR-Stills-At-Jai-Lava-Kusa-Movie-Jayotsavam-08విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత కథతో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నేనే రాజు నేనే మంత్రి’తో ఇటీవల మంచి హిట్‌ అందుకున్న దర్శకుడు తేజ ఈ బయోపిక్‌ను తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ని ఈ బయోపిక్ చిత్రంలో నటిస్తారా? అని ఓ ఆంగ్లపత్రిక ప్రశ్నించింది. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘నాకు అంత ధైర్యం లేదు. ఆ పాత్రలో నేను నటించలేనని కాదు.. ఆ ప్రయత్నం చేసే ఉద్దేశం లేదు.’ అని అని తేల్చి చెప్పారు.

ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ… ‘మా తాతయ్య ఆరోజు కుటుంబాన్ని విడిచి ప్రజలకు సేవ చేయడానికి (రాజకీయాల్లోకి) వెళ్లి, రాష్ట్ర ప్రజల ఆస్తిగా మారారు. ఆయన జీవితం గురించి సినిమా తీస్తామని ఎవరు ముందుకొచ్చినా.. మరొకరు దాన్ని ఆపగలరని నేను అనుకోవడం లేదు. ఆయనపై సినిమా తీసే స్వేచ్ఛ అందరికీ ఉంది.’ అన్నారు.

ఇక నందమూరి తారకరామారావు బయోపిక్‌ తెరకెక్కిస్తానని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తొలుత ప్రకటించారు. తర్వాత ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి పేరుతో ఆ సినిమా తీస్తానని పేర్కొన్నారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ టైటిల్‌తో తెరకెక్కించనున్న ఈ చిత్రం లక్ష్మీపార్వతి దృష్టి కోణం నుంచి ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ విడుదల చేశారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25

Poll