కోలీవుడ్

‘అజ్ఞాతవాసి’ ని కాపాడటం కోసం డిస్ట్రిబ్యూటర్స్ స్కెచ్

pawan-1పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం అజ్ఞాతవాసి. జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తమిళనాడులో మాత్రం అదే రోజు విక్రమ్ నటించిన స్కెచ్ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంపైనా అక్కడ ఫ్యాన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి.

దాంతో పవన్ సినిమాకు విక్రమ్ సినిమా పోటీ అవుతుందని అంచనాలు వేస్తున్నారు.అయితే తమిళనాట సైతం అజ్ఞాతవాసి సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ భారీ రేటు పెట్టి కొనుగోలు చేసారు. ఈ నేపధ్యంలో స్కెచ్ సినిమానుంచి తప్పించుకోవటం కోసం ఓ స్కెచ్ వేసారు. అజ్ఞాతవాసి ని సైతం భారీ ఎత్తున 150 థియోటర్స్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. అప్పుడు కేవలం మొదటి మూడు రోజుల్లోనే తాము పెట్టిన పెట్టుబడి వస్తుందని భావిస్తున్నారు.

అమెరికాలో అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతున్న తొలి భారతీయ మూవీగా రికార్డు సాధించిన అజ్ఞాతవాసి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్న‌ యూనివర్శల్ స్టూడియోస్‌లోని సిటీ వాక్ థియేటర్స్‌లో ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రంగా గుర్తింపు తెచ్చుకోనుంది . సినిమా రిలీజ్ త‌ర్వాత ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు చెరిపేస్తుంద‌ని ప‌వ‌న్ అభిమానులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ స‌భ్యులు యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. చిత్రం మొత్తం 2 గంట‌ల 38 నిమిషాల(158 నిమిషాలు) ర‌న్ టైం ఉంటుందని సెన్సార్ స‌ర్టిఫికెట్‌ని బ‌ట్టి తెలుస్తుంది. కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌ల‌గా న‌టించిన ఈ చిత్రంలో ముర‌ళీ శ‌ర్మ‌, బొమ‌న్ ఇరానీ, ఖుష్బూ ముఖ్య పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే.

 

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16