Needi-Naadi-Oke-Katha-baner1
కోలీవుడ్

‘కబాలి’ ఇష్యూ …రజనీ ఇంటిముందు పోస్టర్స్ వేసి బెదిరింపు

kabali“జనాలకి సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్ , ముందు జివి సెల్పకుమార్ ఫ్యామిలీని సేవ్ చేయమనండి..అతనికి వేరే దారిలేదు..కబాలి రిలీజ్ చేసి ప్యామిలీతో రోడ్డుపై పడిపోయాడు?” అంటూ కొన్ని పోస్టర్ లు రజనీకాంత్ ఇల్లు ఉన్న పోయిస్ గార్డెన్ వద్ద వెలిసింది. దాంతో అదో పెద్ద ఇష్యూగా మారింది. ఇంతకీ ఎవరీ సెల్వకుమార్..కబాలి లాస్ ఏంటి ,మధ్యలో ఈ పోస్టర్స్ బెదిరింపు ఏమటి అంటారా..అయితే ఈ కథనం చదవండి.

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘కబాలి’. పా రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌ థాను నిర్మించారు. 2016లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో కొన్ని ఏరియాల్లో కొన్నవారికి భారీ నష్టాలే మిగిల్చింది. దాంతో కాలా సినిమా రిలీజ్ వేళ.. వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం కోసం తాను పెట్టిన డబ్బులను నిర్మాత థాను తిరిగి ఇచ్చేస్తే.. అప్పులు చెల్లిస్తానని పంపిణీ దారుడు సెల్వకుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన సమస్యలు చెప్పుకొన్నారు.

‘నా పేరు సెల్వకుమార్‌. వేలూరు, పాండిచ్చేరి ప్రాంతంలో ‘కబాలి’ చిత్రాన్ని నేనే పంపిణీ చేశా. గత 20 నెలలుగా నేను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. ఈ సినిమాను పంపిణీ చేయడానికి అప్పు తీసుకున్నా. కానీ, నేను పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదు. అందుకు డబ్బులు తిరిగి ఇవ్వాలని థాను (కలైపులి ఎస్‌ థాను)ను కోరుతున్నా. ఆయన ఇచ్చేస్తే అప్పు తీరుస్తా’.

‘డబ్బులు తిరిగి ఇవ్వాలని వడ్డీ వ్యాపారులు అడుగుతూనే ఉన్నారు. నా జీవితానికి వాళ్లు చరమగీతం పాడేట్టు ఉన్నారు. నా జీవితం పెను ప్రమాదంలో ఉంది. నా భార్య నగలు అమ్మి, కొంత డబ్బు కట్టాను. వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోవాలి అనుకున్నా. ఈ సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా. దీనికి నా చావే సమాధానం అవుతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా’.

‘డబ్బులు ఇస్తానని థాను చెప్పారు. ఆయన్ను నేను నమ్మాను. కానీ, నేను అప్పు తీసుకున్న వారు దాన్ని నమ్మడం లేదు. థాను డబ్బులు ఇస్తే.. వారికి ఇచ్చేసి, నా దారిన నేను వెళ్లిపోతా. ‘కబాలి’ ద్వారా నాకు వచ్చిన మొత్తం షేర్‌ రూ.2.77 కోట్లు. కానీ, ఈ సినిమా పంపిణీ హక్కులను నేను రూ.5.5 కోట్లతో కొన్నా. దాదాపు రూ.2.8 కోట్లు నష్టపోయా. రూ.1.5 కోట్లు ఇస్తానని థాను ప్రమాణం చేశారు. ఆయన కనీసం ఆ డబ్బులు ఇచ్చినా.. మిగిలింది నేను ఎలాగో ఇచ్చుకుంటాను. ఇప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు’ అని ఆయన తన బాధను వ్యక్తం చేశారు.

ఈ విషయంలో రజనీకాంత్‌ ప్రమేయం లేదని సెల్వకుమార్‌ చెప్పారు. తలైవాను కలిసి తన సమస్యను వివరించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే ఊహించని విధంగా రజనీ ఇంటిముందు వెలిసిన పోస్టర్స్ సంగతేంటి అని అడిగితే…వాటి గురించి తనకీ కొద్ది సేపటి క్రితమే తెలిసిందని, తనకు అప్పు ఇచ్చిన వాళ్లే ఇలా చేసి ఉంటారని, ఇష్యూని అందరి దృష్టికి తీసుకెళ్లి సెటిల్ చేసుకోవటానికే ఇలా చేసి ఉంటారని బదులిచ్చారు. ఏదైమైనా పోస్టర్స్ వ్యూహం ఫలించేటట్లే ఉంది.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2