Uncategorized టాలీవుడ్

‘అర్జున్‌రెడ్డి’ పై రాజమౌళి రివ్యూ

rajamouli-arjunreddyరాజమౌళి ఏ సినిమాపైనైనా స్పందించి బాగుందంటే.. ఆ సినిమాను అప్పటివరకు చూడని వాళ్లు కూడా థియేటర్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. రాజమౌళి తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూసి దానిపై స్పందించారు.

తాజాగా ఈ చిత్రంపై దర్శధీరుడు రాజమౌళి స్పందించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారని ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు. ‘ఇప్పుడే అర్జున్‌ రెడ్డి సినిమా చూశాను. ప్రేమ కథలు తెరకెక్కించడం నా తరం కాదు. అయినా ఈ సినిమాను ప్రశంసించకుండా ఉండలేను. సినిమాలో విజయ్‌ దేవరకొండ అదరగొట్టేశాడు. అర్జున్‌ పాత్రలో జీవించేశాడు.

అతనే కాదు నటి షాలిని, మిగతా నటీనటులు కూడా చాలా బాగా నటించారు. డైలాగులు కూడా ఆకట్టుకుంటున్నాయి. క్రెడిట్‌ అంతా దర్శకుడు సందీప్‌ వంగదే. చిత్రబృందాన్ని చక్కగా హ్యాండిల్‌ చేయగలిగాడు. సినిమా విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు.

విజయ్‌ దేవరకొండ హీరో గా నటించిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే సెలబ్రిటీల నుంచి ప్రేక్షకుల వరకు అద్భుత స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై, ఇందులో నటించిన విజయ్‌పై వర్మ, కేటీఆర్‌ ప్రశంసల జల్లులు కురిపించారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll