టాలీవుడ్

బాబి నెక్ట్స్ మెగా హీరోతో ఖరారు

director-bobby-latest-interview-photosరచయిత నుంచి దర్శకుడుగా మారిన బాబి వరస పెట్టి హీరోల సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో హీరోలను పడేస్తున్నాడు. అభిమానులను అలరిస్తున్నాడు. తొలి చిత్రం రవితేజ ‘పవర్‌’తో తనని తాను నిరూపించుకొన్నాడు బాబి (రవీంద్రనాథ్‌).

ఆ తరవాత పవన్‌కల్యాణ్‌తో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చేశాడు. అది వర్కవుట్ కాకపోయినా, ‘జైలవకుశ’తో హిట్ కొట్టి మళ్లీ రేసులోకి వచ్చేశాడు. ‘లవకుశ’ తరవాత బాబి సినిమా ఎవరితో అనేది ఇంత వరకూ తెలీలేదు. అయితే ఈలోగా కొన్ని కథలు సిద్ధం చేసుకొన్నాడు. ఓ కథ రవితేజ కోసమట. మరో కథ సాయిధరమ్‌ తేజ్‌ కోసం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఆ ప్రాజెక్టు రవితేజ తో చేయబోయే సినిమా కన్నా ముందా తర్వాత అనేది మాత్రం తెలియటం లేదు.

సాయిధరమ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, కెరీర్‌ క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు సాయిధరమ్‌ చాలా భరోసా అందించాడని, తన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని బాబి అంటున్నాడు. ప్రస్తుతం ‘జవాన్‌’ సినిమాతో బిజీగా ఉన్నాడు సాయిధరమ్‌. ఆ తరవాత కూడా ఒకట్రెండు ఆఫర్లున్నాయి. మరి బాబి కథని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll