బాక్స్ ఆఫీస్

దేవకట్టాకు హీరో దొరికాడు..ఈసారైనా హిట్ కొడతాడా?

deva kattaవెన్నెల, ప్రస్థానం లాంటి విభిన్న తరహా సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు దేవకట్టా.. అ తర్వాత ఆయన చేసిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవటంతో వెనకబడ్డారు. గ్యాప్ తీసుకున్న దేవకట్టా ప్రస్తుతం తన తదుపరి సినిమా ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవ్వరో కాదు విజయ్ దేవరకొండ.

‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న విజయ్‌ దేవరకొండ. …వరసపెట్టి ప్రాజెక్టులు సైన్ చేస్తున్నారు. ఆయన్ని సంప్రదించిన దేవకట్టా…ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. భవ్యక్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మించనున్నారు.

ప్రస్తుతం దేవకట్టా పూర్తి స్క్రిప్టు రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి ‘మహా ప్రస్థానం’ అనే వర్కింగ్ టైటిల్ ని కూడా పెట్టుకున్నాడని సమాచారం. 7 ఏళ్ళ వయసు నుంచి డబ్బు అనేసాని కోసం ఏం చెయ్యడానికైనా సిద్దపడిన ఓ కుర్రాడు పెరిగి పెద్దయ్యి ఈ ప్రజలనే శాశించే స్థాయికి ఎదిగిన వ్యక్తి కథ అని చెప్తున్నారు. నన్ను ద్వేషించండి, నేను లంచగొండిని, నేను క్రిమినల్ ని ఫైనల్ గా నేనే ఈ మహా ప్రస్థానానికి విలన్ అనే విధంగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్న దేవకట్టా త్వరలోనే ఈ కథకి సరిపొయీ నటీనటుల్ని ఎంచుకోనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు అనౌన్స్ చేస్తాడు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16