బాక్స్ ఆఫీస్

‘మహానుభావుడు’ ఓవర్ సీస్ రైట్స్ ఎంత పలికాయో తెలిసా

Mahanubhavudu-Movie-Stills-2‘నా పేరు ఆనంద్‌. నాకో ఓసీడీ ఉంది. ఓసీడీ అంటే బీటెక్‌, ఎమ్‌టెక్‌ లాంటి డిగ్రీలు కాదు.. డిజార్డర్‌. అతిశుభ్రం, విపరీతమైన నీట్‌నెస్‌ దీని లక్షణాలు’ అంటూ హీరో శర్వానంద్‌ తన కేరెక్టర్‌ని పరిచయం చేసే ‘మహానుభావుడు’ టీజర్‌ గురువారం విడుదలైంది. మారుతి దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సంస్థలో శర్వానంద్‌ ముచ్చటగా మూడోసారి నటిస్తున్న సినిమా ఇది. ఆయన కేరెక్టర్‌ చాలా విభిన్నంగా, వినోదభరితంగా ఉంటుందని ఆ టీజర్‌ చూసినవాళ్లకి అర్థమైపోతుంది. అందుకేనేమో ఓవర్ సీస్ రైట్స్ దుమ్ము దులిపేసాయి.

శతమానం భవతితో హిట్ కొట్టిన శర్వానంద్ కు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతూనే ఉంది. తనదైన యాక్టింగ్ స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్… వరుస హిట్స్‌తో మాంచి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే రీసెంట్‌గా కమర్షియల్ యాంగిల్ చూపించాలని తాపత్రయపడ్డ శర్వా దెబ్బ తిన్నాడు. ‘రాధ’తో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయినా సరే ఈ హీరోగారి క్రేజ్‌లోగానీ, డిమాండ్‌లో గానీ ఇసుమంతైనా తేడా రాలేదట.

ఓ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రన శర్వానంద్ మార్కెట్‌కు ఎలాంటి ఇబ్బందిలేదని ట్రేడ్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. అందుకేనేమో అతడి తదుపరి చిత్రాలకూ మార్కెట్ వాల్యూ ఏ మాత్రం తగ్గలేదట. శర్వా మారుతి డైరెక్షన్‌లో ‘మహానుభావుడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ మంచి ధర పలకడంతో శర్వా రేంజ్ పెరుగుతోందే తప్ప తగ్గలేదని స్పష్టం అయింది. మరోవైపు దర్శకుడు మారుతి ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది. దీంతో ‘మహానుభావుడు’కు ఆటోమెటిక్‌గా హైప్ క్రియేట్ అయింది. బయ్యర్లు సైతం సినిమాను మంచి ధరలకు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే సీస్ రైట్సే 3.5 కోట్లు పలికాయని తెలుస్తోంది.

శర్వానంద్‌, మెహరిన్‌ హీరోయిన్‌గా రూపొందుతోన్న సినిమా ‘మహానుభావుడు’. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శర్వా అబ్సెసివ్‌ కంప్లెసివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ)అనే వ్యాధితో బాధపడుతున్న కుర్రాడులా దర్శనమివ్వబోతున్నాడు. మెహరిన్‌ క్యూట్‌గా గ్లామర్‌తో కనిపించింది. ఈ చిత్రం టీజర్‌ని ఈనెల 24న విడుదల చేశారు. విడుదలైన క్షణం నుండి అనూహ్య స్పందన లభించింది. ఇప్పటికి అరకోటికిపైగా డిజిటల్‌ వ్యూస్‌ని సాధించింది.

ఈ టీజర్‌లో హీరో శర్వానంద్‌ శుభ్రతను కోరికునే యువకుడు అంటే మిస్టర్‌ క్లీన్‌గా కనిపించాడు. ముఖ్యంగా టీజర్‌లో వచ్చిన ”నా పేరు ఆనంద్‌ నాకో ఓసీడీ ఉంది.. ఓసీడీ అంటే బీటెక్‌, ఎంటెక్‌ లాంటి డిగ్రీలు కాదు ఇదొక డిజార్డర్‌. ఈ లక్షణాలు అతి శుభ్రం, విపరీతమైన నీట్‌ నెస్‌..” అంటూ వాయిస్‌ ఓవర్‌తో ఆకట్టుకున్నారు. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll