టాలీవుడ్

‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్’ కాపీ వివాదంపై దర్శకుడు దశరథ్ ఏమంటారంటే..

mr-parfect-dasarathతెలుగు సినీరంగంలో ప్రముఖ నిర్మాత అయిన దిల్‌రాజుపై కేసు నమోదైంది. దిల్‌రాజు నిర్మించిన ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్’ చిత్రం తన నవల ‘నా మనసు నిన్ను కోరే’ నుంచి కాపీ కొట్టారంటూ శ్యామల అనే రచయిత మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన అనుమతి తీసుకోకుండా తన నవలలోని స్టోరీని వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. శ్యామల ఫిర్యాదుతో దిల్‌రాజుపై సెక్షన్ 120ఏ, 415, 420 కాపీ రైట్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు పేర్కొన్నారు.dasa

ప్రభాస్, కాజల్, తాప్సి కాంబినేషన్‌లో 2011లో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించిన విషయం తెలిసిందే. దశరథ్ కొండపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన ఈ విషయమై వివరణ ఇచ్చారు.dasa2

దశరథ్ రాతపూర్వక వివరణ ఇస్తూ ‘శ్యామలారాణిగారి నవల నా మనసు నిన్ను కోరి 2010 ఆగష్టులో రిలీజ్ చేశారు. కానీ అంతకంటే ముందే 2009 మి. పర్ఫెక్ట్ కథని నవ్వుతూ అనే టైటిల్ తో రైటర్స్ యూనియన్లో రిజిస్టర్ చేయించాం. 2008 డిసెంబర్లో ఈ కథను నేను, దిల్ రాజుగారు ప్రభాస్ కు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని రైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణగారు శ్యామలారాణికగారికి వివరించడం జరిగింది. అయినా ఆమె అర్థం చేసుకోవడంలేదు. ఇప్పటికైనా ఆమె నిజాలను గ్రహించాలని కోరుతున్నాను’ అన్నారు. ఈ వివాదంపై దిల్ రాజు ఇంకా స్పందించలేదు.

Comments

comments

Latest

Song

Promo

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll