గాసిప్స్

ఆంజనేయస్వామి పాత్రలో దగ్గుపాటి రానా

ranaప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ‘రావణ’ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భారీ బడ్జెట్టుతో వివిధ బాషలకు చెందిన నటీనటుల కలయికలో ఈ చిత్రాన్ని ‘నభూతో నభవిష్యతి’ రీతిలో నిర్మించాలనేది మోహన్ బాబు ప్లాన్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

కాగా, మోహన్ బాబు రావణాసురుడిగా నటించే ఈ చిత్రంలో దగ్గుపాటి రానా… ఆంజనేయస్వామి పాత్ర పోషించే అవకాశం వుందని అంటున్నారు. ఇంతకు ముందు ఈ పాత్రకు గాను మంచు విష్ణుని అనుకోవటం జరిగింది కానీ…ఇప్పుడు సీన్ లోకి రానా వచ్చేరని తెలుస్తోంది. ఇప్పటికే రానాకు ఈ పాత్ర గురించి చెప్పటం జరిగిందని,తను ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు రాజమౌళి సైతం గ్రాఫిక్స్ విభాగంలో సహకారం అందించే అవకాసం ఉందని సమాచారం. తన గురువు రాఘవేంద్రరావు కోసం ఆయన హెల్ప్ చేస్తానని ఒప్పుకున్నారట.

‘రావణుడి జననం నుంచి మరణం వరకు సాగే సంఘటనలతో ఈ సినిమా సాగుతుంది. యస్వీఆర్, యన్టీఆర్ లాంటి నటులు పోషించిన పాత్రను నేను చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. భారత దేశంలో పేరెన్నికగన్న నటీనటులు ఇందులో నటిస్తారు’ అంటున్నారు మోహన్ బాబు.

ఇందులో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, అజయ్ దేవగణ్, వివేక్ ఒబెరాయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. వీరితో ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చించడం జరిగిందనీ, ఇందులో నటించడానికి వారు ఆసక్తి చూపుతున్నారనీ అంటున్నారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll