టాలీవుడ్

దారిన పోయే దానయ్యలు అంటూ మండిపడ్డ ఎన్టీఆర్

Jr-NTR-Stills-At-Jai-Lava-Kusa-Movie-Jayotsavam-08‘‘విడుదలవుతున్న సినిమా చావు బతుకుల మధ్య అత్యవసర చికిత్స విభాగంలో చేరిన ఓ పేషంట్‌తో సమానం. వాళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న బంధువులే సినిమా బృందం. ప్రేక్షకులే వైద్యులు. ఎంతో పరిశోధనలు చేసి సేవలు అందిస్తున్న వైద్యులే పేషంట్‌ గురించి చెప్పాలి. కానీ వాళ్లకంటే ముందే అంతా మాకే తెలుసన్నట్టుగా మధ్యలో వ్యక్తులు ‘ఇక బతకడు’ అంటూ మాట్లాడేస్తుంటారు. తమ కుటుంబ సభ్యుడి కోసం ఆశగా ఎదురు చూస్తున్న బంధువులకి ధైర్యాన్నివ్వకపోగా వాళ్లే ముందు చంపేస్తుంటారు.

దారిన పోయే దానయ్యల్లాంటి కొద్దిమంది విశ్లేషకులు సినిమాల విషయంలో అదే చేస్తున్నారు. వైద్యుల్లాంటి ప్రేక్షకులు సినిమా గురించి స్పందించేవరకు ఓపిక పట్టాలి. అందరికీ వాక్‌ స్వాతంత్య్రం ఉంది. కానీ మనం మాట్లాడే మాట అవతలి వ్యక్తికి ఉన్న ఆశల్ని దిగజార్చకూడదు. నేను మాట్లాడే మాటల్లో తప్పులు ఉంటే క్షమించండి, అర్థమే లేదనుకొంటే వదిలేయండి. మా ఒక్క సినిమాకే కాదు, పరిశ్రమలో ఈమధ్య తరచూ జరుగుతున్న వ్యవహారం ఇది. మా అందరి బాధని చెప్పే ప్రయత్నమే’’ అన్నారు ఎన్టీఆర్‌.

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకుడు. కల్యాణ్‌రామ్‌ నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ఇలా సినిమా విమర్శకులపై మండిపడ్డారు.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll