కోలీవుడ్

త్రిషపై నిర్మాత ఫిర్యాదు

ప్రముఖ నటి త్రిషపై నడిగర్‌ సంఘంలో కంప్లైంట్ నమోదైంది. విక్రమ్‌ హీరోగా నటించిన ‘సామి 2’ సినిమాలో తొలుత త్రిషను హీరోయిన్ గా ఎంపికచేసుకున్నారు. షూటింగ్‌ మొదలైన కొన్ని రోజుల తరువాత త్రిష వ్యక్తిగత కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకొన్నారు. దాంతో చిత్ర యూనిట్ హీరోయిన్ గా కీర్తి సురేశ్‌ను ఎంపికచేసుకుంది.

అయితే త్రిష సినిమా నుంచి తప్పుకోవడంతో చిత్ర నిర్మాత శిబు థమీన్స్‌ నడిగర్‌ సంఘంలో ఫిర్యాదు చేశారట. ఈ విషయాన్ని శిబు మీడియా ద్వారా వెల్లడించారు. ముందు సినిమాకు ఓకే చెప్పి షూటింగ్‌ మొదలయ్యే సమయంలో తప్పుకోవడంతో తాము చాలా నష్టపోయామని శిబు పేర్కొన్నారు. ఈ విషయంలో త్రిష స్పందించాల్సి ఉంది.

2003లో వచ్చిన ‘సామి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

మరో ప్రక్క ‘నాయకి’ సినిమాతో వచ్చిన త్రిష ఇప్పుడు ‘మోహిని’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రమణ మధేశ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

యాక్షన్ .. సస్పెన్స్ .. హారర్ .. రొమాన్స్ లతో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. మోహినిగా మోడ్రన్ గాను .. దెయ్యంగాను త్రిష సూపర్ గా వేరియేషన్స్ చూపించింది. ఫోటో గ్రఫీ .. గ్రాఫిక్స్ ఈ సినిమాను ఓ మెట్టు పైకి తీసుకెళ్లేలా వున్నాయని ట్రైలర్ చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. ఆమె శరీరాన్ని చంపేశావు గాని ఆత్మని చంపలేదు అనే డైలాగ్ లోనే హారర్ రివెంజ్ డ్రామా అని తెలుస్తోంది.

మరోపక్క త్రిష.. ‘హే జూడ్‌’ అనే మలయాళీ చిత్రంలో నటిస్తున్నారు. శ్యాంప్రసాద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషకి జోడీగా నివిన్‌ పౌలీ నటిస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
మనసుకు నచ్చింది JAN 26
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll