Needi-Naadi-Oke-Katha-baner1
టాలీవుడ్

రేపటి నుంచి సినిమా థియోటర్స్ బంద్..ఎన్ని రోజులో ఇంకా తేలలేదు

theatersఆంథ్రా, తెలంగాణాలోని రెండు వేల థియోటర్స్ తో కలిపి, మొత్తం సౌతిండియాలో ఉన్నదాదాపు 5000 థియోటర్స్ రేపటి నుంచి తమ ప్రదర్శనలను నిలిపి వేయనున్నాయి. అందుకు కారణం… మార్చి 2 నుంచి థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేతకు దక్షిణ చిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ క‌మిటీ పిలుపునివ్వటమే. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు (డీఎస్‌పీ) అధిక‌ మొత్తంలో ధ‌ర‌ల వాత వేయ‌డంతో నిర్మాత‌లు, పంపిణీదారుల‌కు పెద్ద మొత్తంలో భారం త‌ప్పడం లేదన్నది వాద‌న‌.. డీఎస్‌‌పీలు థియేట‌ర్లను గుప్పిట్లో పెట్టుకుని కాంట్రాక్టుల పేరుతో భారీ మొత్తాల్ని గుంజుతున్నార‌న్న అభియోగంతో బంద్‌‌కు జేగంట మోగింది. ఇప్పటికే ప‌లుమార్లు డీఎస్‌పీ యాజ‌మాన్యం‌తో ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌ జాయింట్ యాక్షన్‌ క‌మిటీ చర్చలు జ‌రిపినా విఫ‌ల‌ం కావడంతో సినిమాల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్‌ కామ‌ర్స్ డిజిట‌ల్ క‌మిటీ ఛైర్మన్‌ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వ‌ర‌కూ జ‌రిగిన స‌మావేశాల్లో ప్రధానంగా మూడు అంశాల‌పై చర్చలు జ‌రిగాయి. 1. వి.పి.ఎఫ్ రుసుములు క‌ట్టేది లేద‌ని.. 2. సినిమా ప్రకటనలు మాకివ్వాల‌ని, 3. క‌మ‌ర్షియ‌ల్ ప్రకటనలు 8 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉండ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ల‌ను వాళ్ల ముందుంచాం. కానీ చర్చలు విఫలం అయ్యాయి. దక్షిణ చిత్ర పరిశ్రమలోని అన్ని చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌ల నుంచి పూర్తిగా మ‌ద్దుతు ల‌భించింది. మార్చి 2 నుంచి సినిమా ప్రదర్శన నిలిపివేయ‌డానికి నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన చెప్పారు.

సెక్రటరీ ముత్యాల‌ రామ‌దాసు మాట్లాడుతూ… ‘మార్చి 2 నుంచి థియేట‌ర్లలో సినిమా ప్రదర్శనను నిలిపేస్తున్నాం. రెండు నెల‌ల నుంచి డిజిట‌ల్ ధ‌ర‌లు భ‌యంక‌రంగా పెంచేశారు. ఈ నేప‌థ్యంలో జాయింట్ యాక్షన్ క‌మిటీ ఏర్పాటు చేశాం. క‌మిటీ ఛైర్మన్‌గా డి.సురేష్ బాబు, క‌న్వీన‌ర్‌గా పి. కిర‌ణ్‌ బాధ్యత‌లు తీసుకున్నారు. దీనికి ముందు ఆరు సంవత్సరాల నుంచి సురేష్ బాబు, సి.క‌ల్యాణ్, ఎన్.వి ప్రసాద్ క‌లిసి పోరాటం చేసినా డిజిట‌ల్ యాజ‌మాన్యాలు దిగిరాలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం. దాని ఆధ్వర్యంలో హైద‌రాబాద్, చెన్నై, బెంగుళూరులో డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల యాజ‌మా‌న్యాలతో ప‌లు అంశాల‌పై చర్చలు జ‌రిపాం. అవి విఫ‌ల‌మ‌య్యాయి.

అలాగే ఈరోజు ఉద‌య‌మే తెలంగాణ రాష్ర్ట సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాం. ఆయ‌న కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం త‌రఫున ఎప్పుడూ స‌హ‌కారం ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. మా పోరాటానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌లో ఉన్న అన్ని థియేట‌ర్ల యాజ‌మాన్యాలు పూర్తిగా మ‌ద్దతు ఇచ్చాయి. నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, పంపిణీ దారులు అంతా ఒకే తాటిపైకి వ‌చ్చి పోరాటం చేయ‌డానికి సిద్ధమ‌య్యాం. థియేట‌ర్ల నిలిపివేత అన్నది ఎన్ని రోజులు కొన‌సాగుతుందో చెప్పలేం. మా పోరాటానికి ప్రేక్షకులు కూడా స‌హ‌క‌రిస్తార‌ని ఆశిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2