టాలీవుడ్

రెడీ..యాక్షన్..కట్….సైరా షూటింగ్ స్టార్ట్

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’మొదలైంది. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశం గచ్చిబౌలిలోని అల్యుమీనియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ఇందుకోసం భారీ సెట్‌ కూడా వేశారు.

1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ భారీ సెట్ వేయ‌గా ఇందులో చిరుతో పాటు ప‌లువురు విదేశీ జూనియ‌ర్ ఆర్టిస్టుల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీకరించిన‌ట్టు స‌మాచారం. స్టైలిష్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కొద్ది రోజుల క్రిత‌మే చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు సినిమా టీంని నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. అయితే ఇందులో సంగీత ద‌ర్వ‌కుడిగా ఏఆర్ రెహమాన్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవివర్మన్‌ను తీసుకున్నారు.

వివిధ కారణాలతో సంగీత ద‌ర్శ‌కుడు, సినిమాటోగ్రాఫ‌ర్‌ ‘సైరా’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో రత్నవేలును కెమెరామన్‌గా ఎంపిక చేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.తమన్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చినా అధికారికంగా ప్రకటించలేదు. రాయలసీమ పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పొలాచ్చి, రాజస్థాన్‌లతో పాటు ప‌లు ప్రాంతాలలోను షూటింగ్ జ‌రుపుకోనుంది.

ఇక తాజాగా చిత్ర ఛాయాగ్రాహ‌కుడు ర‌త్న‌వేలు ఈ పీరియాడిక‌ల్ మూవీలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంద‌ని ట్వీట్ చేశాడు.

ఈ విషయాన్ని చిరు కోడలు ఉపాసన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘కొణిదెల కుటుంబానికి ఇదో కొత్త ప్రారంభం. మిస్టర్‌.సి(చరణ్‌) రెండోసారి నిర్మాతగా మామయ్య 151వ చిత్రాన్ని ఈరోజు నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలోని ‘సైరా నరసింహారెడ్డి’ పాత్ర, చిత్రబృందం మిమ్మల్ని తప్పకుండా మెస్మరైజ్‌ చేస్తాయి’ అని ఉపాసన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ సినిమాకి తొలుత ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారట. దాంతో ఈ సినిమాకి ఎస్‌.ఎస్‌ తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో చిరుకి జోడీగా నయనతార నటిస్తున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2018లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll