టాలీవుడ్

పార్టీలో చిరు, రాజశేఖర్,మోహన్ బాబు రచ్చ

shiru rajashaker mohan babuసినిమాల్లో,రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. సక్సెసే అందరూ బంధువు. ప్లాఫే అందరికి ఉమ్మడి శత్రువు. ఆ విషయం చాలాసార్లు చాలా విషయాల్లో ప్రూవ్ అయ్యింది. ఇదిగో ఇప్పుడు మరోసారి రుజువైంది. చిరంజీవి, రాజశేఖర్ చాలా కాలంగా ఎడమొహం,పెడమొహంగా ఉంటూ వస్తున్నారు. అలాగే చిరంజీవి, మోహన్ బాబులకు కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని చెప్పుకునేవారు. కానీ ఈ ముగ్గురూ కలిసారు.

వివరాల్లోకి వెళితే…మెగాస్టార్‌ చిరంజీవి.. ప్రముఖ నటులు మోహన్‌బాబు, రాజశేఖర్‌లతో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. జనవరి 1న హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో నిర్వహించిన న్యూఇయర్‌ వేడుకల్లో వీరంతా పాల్గొని సందడి చేశారు. వేడుకలకు రాజశేఖర్‌ కుటుంబంతో హాజరయ్యారు. మాజీ ఎంపీ, ప్రముఖ నిర్మాత సుబ్బరామిరెడ్డి, నాగబాబు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. వీరంతా కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇక కెరీర్ పరంగా చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్నారు. మోహన్‌బాబు ‘గాయత్రి’ సినిమాలో నటిస్తు్న్నారు. మరోపక్క రాజశేఖర్‌ కథనాయకుడిగా నటించిన ‘గరుడవేగ’ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకొంది.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll